భోధిసత్వుడు మళ్లీ వస్తే..(సెవెంత్ సెన్స్ ప్రివ్యూ)

ఇప్పుడు లోకల్ విలన్స్ ఆపరేషన్ రెడ్ తో ఇంట్రడక్షన్ తో సినిమా ప్రారంభమవుతుంది.ఇప్పుడు ఇండియా తొంభై మూడు రోజులు వెనక్కి వెళ్లినట్లు చూపెడతారు. రింగ రింగ సాంగ్ వస్తుంది. సర్కస్ లో సూర్యని పరిచయం చేస్తారు. అలా కాస్సేపటికి మొత్తం సినిమాలోని పాత్రల పరిచయం పూర్తవుతుంది. హీరోయిన్ ని చాలా సింపుల్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అరవింద హీరో పేరు అతను సర్కస్ లో పనిచేస్తూంటాడు. హీరో ..మొదటి చూపులోనే హీరోయిన్ తో నే ప్రేమలో పడతాడు. అక్కడ కొంత కామెడీ రన్ అవుతుంది. అక్కడనుంచి హీరోయిన్ ని ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నాలు చేస్తాడు. కొంత కామెడీ జరిగాక..మున్నాజీ పాట వస్తుంది.అలా జరిగిన తర్వాత హీరోయిన్ ..హీరో వెంటపడుతుంది. హీరోని ఓ మ్యూజియంలోకి తీసుకెళ్లి అక్కడ అతని ఫ్యామిలీ చరిత్ర వివరిస్తుంది.అతనికో తను ఓ సైంటిస్టుని అని ఓ డిఎన్ ఎ కి చెందిన ధీరి చెప్పి ..హీరోలో భోధిధర్ముడు డిఎన్ ఎ ఎక్కించటం ద్వారా అతనిలో మార్పు తేవచ్చునని చెప్తుంది. ఈ లోగా విలన్ ఎంటర్ అవుతాడు. ఆపరేషన్ రెడ్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ వేస్తారు. సినిమాలో ఇప్పటివరకూ సూర్య నటనే హైలెట్ గా నడుస్తుంది. ఇక సెకండాఫ్ లో హీరోయిన్ వైపు నుంచి ఓ ట్విస్ట్ ఉంటుంది. అస్సలు విలన్ ఎందుకుని భోధిసత్వుడుని డిఎన్ ఎ ద్వారా బ్రతికించాలనుకుంటాడు. ఈసారి విలన్ ని హీరో ఎదిరించాడు అనేది మిగతా సినిమా.
సైన్స్ కీ,మానవ నాగరకతకీ కొన్ని నమ్మకాలుకూ ముడివేసే ఈ కథలో సూర్య కొత్త అవతారంలో కనిపించనున్నాడు. కాగా 'గజిని" చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీలాస్ పేషెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించాడు. ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగులో అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











