అల్లు అర్జున్ తో డాన్స్ ఛాన్స్ బెంగుళూరు వాళ్లకే..
అల్లు అర్జున్‌ను కలవడానికి బెంగళూరుకు చెందిన రెండు డాన్స్ టీమ్ లు దాదాపు చివరి దాకా వచ్చాయి. వారికి ఉన్న ఒక్క అడ్డంకును దాటితే వారు అల్లూ అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా రూ.51 లక్షల నగదు బహుమతి కూడా అందుతుంది. ప్రముఖ శీతలపానీయాల సంస్థ సెవెన్‌ఆప్ యువతలో నృత్య కళను వెలికి తీసేందుకు 'డాన్స్‌ఫర్‌మీ' పేరుతో దేశ వ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం సౌత్‌జోన్ నుంచి రెండు ఉత్తమ డ్యాన్స్ టీంలను ఎంపిక చేసింది.
ఇందుకోసం బెంగుళూరు నగరంలోని చౌడయ్య మెమోరియల్ హాల్‌లో గురువారం సెమీఫైనల్స్ జరిగాయి. ఇందులో దక్షిణ భారతదేశంలోని 21 నగరాలకు చెందిన నృత్య బృందాలు తమ నృత్య కౌశలంతో ఆహుతులను అలరించాయి. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నగరానికి చెందిన టీం-6, (అగ్నీ) టీం-13(బాయ్‌జ్) బృందాలను ఫైనల్స్ కోసం ఎంపిక చేశారు. వీరు ఢిల్లీలో జరిగే తుది డాన్స్ పోటీల్లో విజయం సాధిస్తే అల్లూ అర్జున్‌తో కలిసి డాన్స్ చేసే అవకాశం వస్తుంది. అంతేకాక రూ.51 లక్షల నగదు బహుమతి కూడా లభిస్తుంది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ 'జులాయి'టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టనర్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయాటనికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవతం చేస్తున్నట్లు గా చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఆడియోని మే 25న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ తేదీని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గబ్బర్ సింగ్ తో ఊపు మీదున్న దేవి ఈ ఆడియోని అదరకొట్టాడని చెప్తున్నారు.
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.


Click it and Unblock the Notifications











