twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘7 స్టార్స్ విత్ అల్లు’, అల్లు అర్జున్ తో ఆ లక్కీ విన్నర్స్ ఎవరు..!?

    By Sindhu
    |

    ఆకర్షణీయమైన ప్రకటలను గుప్పిస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు శీతలపానీయాల కంపెనీలు పోటీలు పడుతుంటాయి. అందులో సెవెన్ అప్ ఒకటి. శీతల పానియం '7 అప్ సాప్ట్ డ్రింక్" కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ గతంలో ఎన్నో కాంటెస్ట్ లను నిర్వహించింది. తాజాగా '7స్టార్స్ విత్ అల్లు" అనే కాంటెస్ట్ ను ఈ రోజు ఆరంభించనుంది. ఇందులో గెలిచిన ఏడుగురికి అల్లు అర్జున్ తో మ్యూజిక్ వీడియోలో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తారట. ఇందుకోసం ఈ 23 నుంచి ఆడిషన్స్ ఆరంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు లలో 8 సిటీల్లో జరిగే ఈ ఆడిషన్స్ లో జడ్జ్ లు 20 మందిని మంచి డాన్సింగ్ స్కిల్స్ వున్న విన్నర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఫైనల్ గా హైదరాబాద్ లో నవంబర్ 23న గ్రాండ్ ఫినాలే జరగుతుంది. ఇందులో ఫైనల్ గా నిలిచే ఏడుగురు విన్నర్స్ అల్లు అర్జున్ మ్యూజిక్ వీడియోలో పాల్గొంటారని సమాచారం.

    ఇప్పటిదాకా దేశంలో కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌ విభాగంలో గత మూడేళ్లుగా శరవేగంగా వృద్ధిచెందుతోన్న బ్రాండ్‌లలో విశిష్టస్థానాన్ని ఆక్రమించిన రిఫ్రెషింగ్‌ క్లియర్‌ డ్రింక్‌ 7అప్‌ యాజమాన్యం, '7అప్‌స్టార్‌ విత్‌ అల్లు సీజన్‌-2' ప్రారంభాన్ని (అక్టోబర్‌ -23తేదీన) ప్రకటించింది. మంగళవారం నగరంలోని పార్క్‌ హౌటల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలుగు సినీ స్టైలిష్‌ సూపర్‌ స్టార్‌, 7అప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అల్లు అర్జున్‌, పెప్సీకో ఇండియా ఫ్లేవర్స్‌ మార్కెటింగ్‌ (బీవరేజెస్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ రుచిర జైట్లీ మాట్లాడారు.

    ఈ సందర్భంగా రుచిరా జైట్లీ మాట్లాడుతూ దక్షిణ భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో 7అప్‌, నింబూస్‌ లకు ప్రధానమార్కెట్‌ గా పేర్కొన్నారు. పెప్సీ చేపట్టిన వినియోగదారుల ప్రోత్సాహకాల కారణంగా పెప్సీ బ్రాండ్లు ఇక్కడ గణనీయంగా పురోగతి సాధించాయని చెప్పారు. అర్జున్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఒప్పందం కుదిరిందని, అక్టోబర్‌ 23, 2011న '7అప్‌స్టార్‌ విత్‌ అల్లు అర్జున్‌ సీజన్‌-2' పేరుతో నిర్వహించనున్న డ్యాన్స్‌ పోటీల్లో ఏడుగురు అదృష్ట విజేతలను అల్లు అర్జున్‌ ఎంపికజేస్తారని వివరించారు.

    English summary
    7up, the refreshing clear drink with 100% natural lemon and lime flavour from PepsiCo, today announced the launch of ‘7up Star with Allu – Season 2', a popular dance based consumer engagement initiative. The new season of ‘7up Star with Allu' contest is in continuation of the brand's constant endeavour to engage with its millions of consumers across South India market. The contest is open for all dance enthusiasts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X