»   » ఆ తెలుగు సినిమాకు 8 మంది డైరక్టర్స్

ఆ తెలుగు సినిమాకు 8 మంది డైరక్టర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'8"(బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్) టైటిల్ తో ఓ చిత్రం లేటెస్ట్ గా మొదలైంది. ఈ చిత్రం విశేషమేమిటంటే...ఎనిమిదిమంది దర్శకులతో రూపొందటం. దర్శకులు సరే హీరో, హీరోయిన్స్ ఎంతమంది అంటే ఐదుగురు హీరోలు, పదకొండు మంది హీరోయిన్లు అని చెప్తున్నారు. ఫైవ్‌ఫింగర్స్ ఎంటర్ ‌టైన్‌ మెంట్స్ పతాకంపై జలంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జలంధర మాట్లాడుతూ-"ఈ చిత్రాన్ని ఎనిమిది వైవిధ్యమైన కథలతో, ఎనిమిది మంది దర్శకులతో ఓ కొత్త తరహా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రాన్ని వందరోజుల్లో పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నవరసాల సమ్మేళనంతో ఈ చిత్ర కథలుంటాయి. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. రెండున్నర గంటలపాటు ప్రేక్షకులను ఆహ్లాదపరిచే విధంగా ఈ చిత్రాన్ని మలుస్తాం. తప్పకుండా ఈ చిత్రం ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని మా నమ్మకం" అన్నారు. మరి వందరోజుల్లో తీసే ఈ చిత్రం వందరోజూలూ ఆడాలని, ఎనిమిది మంది డైరక్టర్స్ కి సరపడ ప్రేక్షుకులు దీన్ని చూడాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu