ఆ ఒక్కరాత్రికి సమంత ఒప్పుకుంటే రూ. 80 లక్షలు?

By Bojja Kumar

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల్లో సినిమాతారలతో డాన్సులు చేయించేందుకు తమ తమ ప్రయత్నాల్లో మునిగి పోయారు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...ప్రస్తుతం టాలీవుడ్లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న సమంతకు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ భారీ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 31న ఓ స్టార్ హోటల్‌లో జరిగే వేడకల్లో ఐటం సాంగులకు స్టెప్పులేస్తే రూ. 80 లక్షలు ఇస్తామని ఆమె ఆఫర్ చేసారట. ఒక సినిమాలో ఎంతో కష్టపడితే వచ్చే మొత్తం ఒక్కరాత్రికే వస్తుండటంతో టెంప్ట్ అయిన సమంత.....వెంటనే నో చెప్పకుండా ఆలోచించుకుని చెబుతానని వారికి సమాచారం అందించిందట.

 80 Lakhs Offer for Samantha

అయితే సమంత ఆ రాత్రికి ఒప్పుకుంటుందా? లేదా? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే ఆమె అభిమానులు మాత్రం....నెం.1 పొజిషన్లో ఉన్న నీకు ఇది అవసరమా? అని అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి. సమంత ప్రస్తుతం 'మనం','రభస', వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా, లింగు స్వామి దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది.

ఆ విషయాలు పక్కన పెడితే....ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్న సమంత...ఇటీవల మహేష్ బాబు '1-నేనొక్కడినే' సినిమా పోస్టర్ పై చేసిన కామెంట్ వివాదాస్పదం మారింది. ఆ పోస్టర్లో హీరో వెనక హీరోయిన్ కుక్కలా పాకడం అభ్యంతరకంగా ఉందని సమంత కామెంట్ చేయడంతో....మహేష్ బాబు అభిమానులు ఆమెపై ట్విట్టర్లో ఎదురు దాడికి దిగారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X