శ్యాం బెనగల్‌కు అక్కినేని జాతీయ అవార్డ్

హైదరాబాద్ కు చెందిన 78 ఏళ్ల శ్యాం బెనగల్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సాంఘీక, ప్రయోజనాత్మక సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరి సారిగా 2010లో రూపొందించిన 'వెల్ డన్ అబ్బా' చిత్రానికి సోషల్ ఇష్యూస్ విభాగంలో నేషనల్ అవార్డు దక్కించింది.
ఈ అవార్డు గురించి గతంలో అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ...'సినీరంగానికి సుదీర్ఘకాలం సేవలందించిన వారికి ఈ అవార్డ్ ఇస్తున్నాం. అత్యుత్తమ ప్రతిభ, వ్యక్తిత్వ వికాసం, జీవన పరిపూర్ణత, ప్రత్యేకత తదితర అంశాల ఆధారంగా కళాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవార్డ్ ఇది' అని చెప్పుకొచ్చారు.
2005లో ఈ అవార్డ్ పుట్టింది. ప్రతి ఏటా అవార్డులందిస్తున్నారు. తొలి ఏడాది బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరో దేవానంద్ అందుకున్నారు. తర్వాత షబానా ఆజ్మి (2006), అంజలీదేవి (2007), వైజయంతిమాల(2008), లతామం గేష్కర్(2009)లకు దక్కింది. 2010లో అత్యు త్తమ దర్శకుడు కె.బాలచందర్‌కి ఈ పురస్కారం అందుకున్నారు.


Click it and Unblock the Notifications











