For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరీష్ శంకర్‌పై నెటిజన్స్ సెటైర్స్.. నాసా పిక్ కాదు నచ్చిన పిక్ అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

    |

    కరోనాపై నిర్విరామంగా పోరాడుతున్న మన దేశ ప్రజలు సమగ్రతను, సౌబ్రాతృత్వాన్ని చాటేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి తొమ్మింది గంటలకు తొమ్మిది నిమిషాలను పాటు దీపాలను వెలిగించమని ప్రధాని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న రాత్రి భారతదేశం నలుమూలలా జ్యోతి, దీపాలు, కొవ్వొత్తుల వెలుగులు నిండింది. తొమ్మిది గంటలకు ఇంట్లోని లైట్స్‌ను ఆర్పివేసి.. ప్రజలంతా దీపాలను, కొవ్వొత్తులను వెలగించారు.

    జనమంతా ఏకత్రాటిపై..

    జనమంతా ఏకత్రాటిపై..

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ మానవాళిని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. భారతదేశంలోనూ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నాలుగు వేలమందికి పైగా కరోనా సోకింది. ఇలాంటి అంధకార పరిస్థితుల్లో తమ నమ్మకాన్ని కోల్పోలేదని, తామంతా ఒకేత్రాటిపై ఉన్నామనే సమగ్రతను దీపాలను వెలిగించడంతో చాటి చెప్పారు.

     సెలెబ్రిటీలు సైతం..

    సెలెబ్రిటీలు సైతం..

    దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు సినీ తారలంతా దీపాలను వెలిగించి సమగ్రతను చాటారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ దీపాలను, కొవ్వొత్తులను వెలిగించి కరోనాపై పోరును కొనసాగిస్తామని ప్రకటించారు.

    ఈ క్రమంలో కొన్ని ఫేక్ ఫోటోలు..

    అయితే ఆదివారం రాత్రి దేశమంతా విద్యుత్ దీపాలు ఆర్పేయడం, ఆ సమయంలో నాసా భారతదేశ చిత్ర పటాన్ని రిలీజ్ చేసిందని ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. కొద్ది సమయం తరువాత అది ఫేక్ ఫోటో అని తెలిసింది. అయితే ఈ ఫోటోను దర్శకుడు హరీష్ శంకర్ పోస్ట్ చేయడంతో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి.

    Jr NTR's Kid Bhargava Ram Grabing Attention In Social Media
    నాకు నచ్చిన పిక్..

    నాకు నచ్చిన పిక్..

    తెలిసే పెట్టారా? అది ఫేక్ పిక్.. మీ ఫోటోకూడా నాసా రిలీజ్ చేసింది అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ రాగా వాటిపై హరీష్ స్పందించాడు. ఓరేయ్ బాబులు.. ఇది నాసా పిక్ కాదు నాకు నచ్చిన పిక్ అని పెట్టా.. ఉండాల్సినోళ్లురా అంటూ అందరికీ ఒకే సారి కౌంటర్ వేశాడు.

    English summary
    Harish Shankar Shared Nasa Fake Photo. Sunday 9 Pm 9 Baje Event Is Grand Success. Harish Shankar Shared A Pic Which Is Gets Trolled.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X