Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హరీష్ శంకర్‌పై నెటిజన్స్ సెటైర్స్.. నాసా పిక్ కాదు నచ్చిన పిక్ అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
కరోనాపై నిర్విరామంగా పోరాడుతున్న మన దేశ ప్రజలు సమగ్రతను, సౌబ్రాతృత్వాన్ని చాటేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి తొమ్మింది గంటలకు తొమ్మిది నిమిషాలను పాటు దీపాలను వెలిగించమని ప్రధాని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న రాత్రి భారతదేశం నలుమూలలా జ్యోతి, దీపాలు, కొవ్వొత్తుల వెలుగులు నిండింది. తొమ్మిది గంటలకు ఇంట్లోని లైట్స్‌ను ఆర్పివేసి.. ప్రజలంతా దీపాలను, కొవ్వొత్తులను వెలగించారు.
జనమంతా ఏకత్రాటిపై..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ మానవాళిని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. భారతదేశంలోనూ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నాలుగు వేలమందికి పైగా కరోనా సోకింది. ఇలాంటి అంధకార పరిస్థితుల్లో తమ నమ్మకాన్ని కోల్పోలేదని, తామంతా ఒకేత్రాటిపై ఉన్నామనే సమగ్రతను దీపాలను వెలిగించడంతో చాటి చెప్పారు.
సెలెబ్రిటీలు సైతం..
దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు సినీ తారలంతా దీపాలను వెలిగించి సమగ్రతను చాటారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ దీపాలను, కొవ్వొత్తులను వెలిగించి కరోనాపై పోరును కొనసాగిస్తామని ప్రకటించారు.
|
ఈ క్రమంలో కొన్ని ఫేక్ ఫోటోలు..
అయితే ఆదివారం రాత్రి దేశమంతా విద్యుత్ దీపాలు ఆర్పేయడం, ఆ సమయంలో నాసా భారతదేశ చిత్ర పటాన్ని రిలీజ్ చేసిందని ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. కొద్ది సమయం తరువాత అది ఫేక్ ఫోటో అని తెలిసింది. అయితే ఈ ఫోటోను దర్శకుడు హరీష్ శంకర్ పోస్ట్ చేయడంతో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి.
Recommended Video
నాకు నచ్చిన పిక్..
తెలిసే పెట్టారా? అది ఫేక్ పిక్.. మీ ఫోటోకూడా నాసా రిలీజ్ చేసింది అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ రాగా వాటిపై హరీష్ స్పందించాడు. ఓరేయ్ బాబులు.. ఇది నాసా పిక్ కాదు నాకు నచ్చిన పిక్ అని పెట్టా.. ఉండాల్సినోళ్లురా అంటూ అందరికీ ఒకే సారి కౌంటర్ వేశాడు.