షాకింగ్...విడుదలకు ముందే‘అత్తారింటికి దారేది’ పైరసీ
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు షాకింగ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే బయటకు లీకైంది. 90 నిమిషాల నిడివిగల ఈ చిత్రం పైరసీ సీడీలు విజయవాడలో లభ్యమవుతున్నాయి. 90 నిమిషాల సినిమా ఎలా బయటకు లీకైందో తెలియక ఇటు దర్శక నిర్మాతలు కూడా తలలు పట్టుకున్నారు.
తమ అభిమాన హీరో సినిమా విడుదలకు ముందు పైరసీ కావడం ఇటు అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఈ రోజు బ్లాక్ డేగా పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. పైరసీని అరికట్టేందుకు అభిమానులు కూడా తమ వంతు సాయం చేయడానికి రంగంలోకి దిగారు.
అత్తారింటికి దారేది పైరసీ సీడీల విషయం బయటకు తెలియగానే యాంటీ పైరసీ విభాగం అప్రమత్తమైంది. ఆ సీడీలు స్ర్పెడ్ కాకుండా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మీకు ఎక్కడైనా అత్తారింటికి దారేది పైరసీ సీడీలుగానీ, ఇంటర్నెట్లో అలాంటి లింక్స్ గానీ కనిపిస్తే...[email protected] కు ఈమెయిల్ చేయండి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించారు. కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












