90ml కిక్కులో తేడా లేదు.. డేట్ మారింది అంతే! లేటెస్ట్ అప్‌డేట్

యంగ్ హీరో కార్తికేయ తాజా సినిమా 90ml రిలీజ్ డేట్ మారింది. టాలీవుడ్ లో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ యాంగిల్‌లో కనిపించనున్నాడు. మొదట ఈ చిత్రాన్ని ఈ రోజు (డిసెంబర్ 5) విడుదల చేయాలని భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్క రోజు వాయిదా వేసి డిసెంబర్ 6వ తేదీని విడుదల తేదీగా ప్రకటించారు.

కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్రతో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన సినిమానే 90ml. ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకిని హీరోయిన్‌గా నటించింది. తెలుగు చిత్రసీమలో ఇదే ఆమెకు తొలి సినిమా. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి మరియు ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన వచ్చింది.

 90ML post poned.. New Release Date Is

ఇక కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు దేవ‌దాస్‌, అతను ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు 'ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌' గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. యూత్‌కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు, కార్తికేయ డాన్సులు, డైలాగ్స్, ఫైట్స్ ట్రైలర్‌లో కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్‌ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'A ' సర్టిఫికెట్ పొందింది 90ml.

ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ "90ml ని మొదట డిసెంబరు 5న విడుదల చేద్దాం అనుకున్నాము కానీ , కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6కి మార్చుకున్నాం. పూర్తిగా కొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమర్షియల్, ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ అంశాలతో ఈ సినిమా రాబోతుంది. మా బ్యానర్‌కి పేరు తెచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం RX100ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X