»   » మద్యం మత్తులో నగ్నంగా....అందరినీ ఇబ్బంది పెడుతున్న సినీ నటుడు!

మద్యం మత్తులో నగ్నంగా....అందరినీ ఇబ్బంది పెడుతున్న సినీ నటుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ నటుడి ప్రవర్తన ఇపుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. 90ల్లో నెగెటివ్ పాత్రలతో అలరించిన సదరు యాక్టర్ ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నాడట.

ఇటీవల బాగా మధ్యం సేవించి తను నివాసం ఉంటున్న అపార్ట్ ముంట్ లాబీలో బట్టలన్నీ నగ్నంగా కలియ తిరిగాడని, అతడి తీరుతో చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని బాలీవుడ్లోని పలు మేగజైన్లు కథనాలు వెలువరించాయి.

మూత్రం పోసి చండాలం చేశాడు

మూత్రం పోసి చండాలం చేశాడు

ఈ ఒక్క విషయంలోనే కాదు, అతడి ప్రవర్తన కొన్ని సందర్భాల్లో చాలా చండాలంగా ఉంటోందని, ఆ మధ్య ఒకసారి బాగా మద్యం సేవించి అపార్టుమెంటు పరిసరాల్లో మూత్రం పోసి చండాలం చేశాడని తెలుస్తోంది.

అతడిపై అనేక ఫిర్యాదులు

అతడిపై అనేక ఫిర్యాదులు

సదరు యాక్టర్ మీద అపార్టుమెంట్ వాసులు చాలా సార్లు ఫిర్యాదు చేశారని, అయినా అతడు తన పద్దతి మార్చుకోవడం లేదని.... అతడి ఆగడాలు ఇంకా శృతి మించుతున్నాయని, త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అపార్టుమెంట్ వాసులు సిద్దమవుతున్నట్లు సమచారం.

కుటుంబం పరువుపోతోంది

కుటుంబం పరువుపోతోంది

సదరు యాకర్టర్ చేస్తున్న పనులతో కుటుంబ సభ్యులు కూడా బయట తలఎత్తుకోలేని పరిస్థితి ఉంది. బయటివారిని ఇబ్బంది పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినడం లేదని.... ఇంట్లో కూడా అతడి ప్రవర్తనతో చాలా ఇబ్బంది పడుతున్నారట.

ఎవరా నటుడు?

ఎవరా నటుడు?

ఆ నటుడి పేరు అందరికీ తెలిసినా.... ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కావడం, అతడు బాగా పేరున్న స్టార్ కావడం...... ఎవరూ ఇప్పటి వరకు పోలీసులకు కంప్లైంట్ లాంటివి ఇవ్వక పోవడంతో బాలీవుడ్ మీడియా పేరు బయట పెట్టడం లేదు. అతడు ఓ సీనియర్ స్టార్, 90ల్లో నెగెటివ్ రోల్ చేశాడు, అతడి ఇద్దరు పిల్లలు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు అనే హిట్ మాత్రం ఇచ్చారు.

English summary
A blind item carried by a popular magazine in its weekly column has caught our attention. We are stunned by this out-of-work 90s' actor and his antics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu