Where is AP Capital? ఏపీ సర్కారుపై #90's మిడిల్ క్లాస్ యాక్టర్ ట్రోలింగ్.. దాడి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఫ్యాన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఏప్రిల్‌లో జరిగే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో అధికారాన్ని చేప్టట్టేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కత్తులు దూసుకొంటున్నాయి. ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ ప్రకటించుకొన్నాయి. ఒకపార్టీపై మరో పార్టీ కార్యకర్తలు వీడియోలు, మీమ్స్, ట్రోల్ మెటీరియల్స్‌తో పరస్పర సోషల్ మీడియా దాడులు చేసుకొంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అయితే ఇటీవల #90s మిడిల్ క్లాస్ బయోపిక్‌లో నటించిన బాల నటుడు మౌళీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమవ్వడమే కాకుండా ట్రెండింగ్‌గా మారాయి. దాంతో బాల నటుడు మౌళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు.

90s Middle Class Biopic Actor Mouli Satrical Videos Where is AP Capital Trending in Social media

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో Where is AP Capital అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ మారింది. సాధారణ పౌరుల నుంచి సినీ ఆర్టిస్టులు ఏపీకి రాజధాని ఎక్కడ? అనే ప్రశ్నతో వీడియోలు చేస్తూ అధికార ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో యాక్టర్ మౌళీ చేసిన వీడియోలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.

90s Middle Class Biopic Actor Mouli Satrical Videos Where is AP Capital Trending in Social media

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచిన వీడియోల్లో.. యాక్టర్ మౌళి తన గుప్పిడిని చూపిస్తూ.. ఇందులో ఒకటి మాయం చేశాను. అదేంటో చెప్పుకోగలరా? అంటూ ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత కొందరు ఏదో సమాధానాలు చెబితే.. అది కాదు.. నేను ఏపీ క్యాపిటల్‌ను మాయం చేశాను. ఏపీ క్యాపిటల్ కావాలంటే దొరకదు చూసుకోండి.. వెళ్లి మ్యాప్‌లో చూడండి అంటూ సెటైర్ వేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

మరో వీడియో విషయానికి వస్తే.. మౌళీ ఓ బస్సులో ప్రయాణిస్టుంటాడు. ఆ పక్కన సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి తమిళనాడకు చెన్నై కాపిటల్, కర్ణాటకకు బెంగళూరు కాపిటల్.. ఆంధ్రాకు క్యాపిటల్ ఏమిటని మౌళీని అడిగితే.. అతడు చిరాకు పడుతాడు. ఈ సెటైరిక్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇదిలా ఉండగా, యాక్టర్ మౌళీ మరో వీడియోను చేశాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే?? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? అని ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం వినడానికి ముందు ఓ వెకిలిగా ఓ నవ్వు నవ్వి సెటైర్ వేశాడు. దాంతో మౌళిపై సోషల్ మీడియాలో పదునైన కామెంట్లతో తిరిగి సెటైర్లు వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏమిటి? అంటూ ఏపీ అధికార ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్న నటుడు మౌళిపై సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నాడు. అసలు ఇలాంటి ప్రశ్న ఉన్న నటుడికి ఓటు హక్కు ఉందా? ఏపీలో ఓటు ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X