twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 100తో కేసు నుంచి రిలీఫ్ అయిన షారుఖ్!

    By Bojja Kumar
    |

    జైపూర్ : బహిరంగ ధూమపానం కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు జైపూర్లోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రూ. 100 జరిమాన విధించారు. జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో ఏప్రిల్ 8న రాజస్థాన్ రాయల్స్, కోల్‌‍కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా షారుఖ్ అందరి మధ్య సిగరెట్లు కాల్చారు.

    బహిరంగంగా పొగ తాగకూడదన్న నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై ఇక్కడి స్థానిక కోర్టులో జైపూర్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ ఆనంద్ సింగ్ రాథోడ్ తరఫున న్యాయవాది నేంసింగ్ రాథోడ్ ఈ కేసు దాఖలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. షారుక్ కేసును అంగీకరిస్తూ క్షమాపణ కోరుతున్నారని బుధవారం ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

    నిందితుడు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో జరిమానాతో సరిపెడుతున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. పొగ తాగకూడదన్న నిబంధనలను ఉల్లంఘించడం షారుఖ్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో షారుఖ్ ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్నారు. ఆయన గురించి తెలిసిన వారంతా షారుఖ్ స్మోకింగ్ కు బానిసయ్యాడు. ఆయన స్మోక్ చేయకుండా ఉండలేడు అని అంటున్నారు.

    English summary
    Jaipur: Superstar Shahrukh Khan has been in the news for all the wrong reasons. Khan has been entrapped in legal hassle after he was spotted smoking in public at Sawaai Man Singh Stadium, Jaipur. But, a smart SRK escaped with a paltry fine of Rs 100, after having pleaded guilty before a Jaipur court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X