‘కొబ్బరిమట్ట’తో సంపూ బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాడు.. డాన్స్ వీడియో కేక!

'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై వినోదాత్మక దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూ త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.

గత కొన్ని రోజులుగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఆగస్టు 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు డేట్ ఖరారు చేస్తూ సంపూ డాన్సింగ్ వీడియో ఒకటి వదిలారు.

'అ.. ఆ.. ఇ.. ఈ' అంటూ సాగే ఈ పాటలో సంపూర్ణేష్ బాబు తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. 'కొబ్బరి మట్ట' మూవీపై హైప్ పెరగడానికి ఈ ఒక్కసాంగ్ చాలు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

A..Aa..E..Ee Song Teaser from Kobbari Matta released

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూ.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ ఇలా మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కమ్రన్ సంగీతం అందించాడు.

ఈ సినిమాలో సంపూ... కామెడీ, యాక్షన్, కోపం, సెంటిమెంట్ ఇలా అన్ని రసాలు పండించి ప్రేక్షకులను మెప్పించబోతున్నాడట. 'హృదయ కాలేయం' సినిమాను మించిపోయేలా సంపూ అలరిస్తారని చిత్ర బృందం చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X