'చిరంజీవి'గా కనిపించనున్న ఏవీఎస్!

ఇందులో ఆయన సి.బి.ఐ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈయన అసిస్టెంట్‌గా సునీల్ నటిస్తున్నారు. ఏవీఎస్ వరసకు మేనల్లుడు పాత్రలో సునీల్ నటిస్తున్న నేపథ్యంలో, వీరి కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలను గురువారం నాడు రాక్ కాజిల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఏవీఎస్‌కు ఆత్మీయ అభినందనలు తెలియజేసింది.
తాను దర్శకత్వం వహించిన "కుబేరులు" సినిమాకు డబ్బింగ్ చెప్పాక చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్ళారని, మళ్ళీ మీరు పూర్తి ఆరోగ్యంతో తన చిత్రంలో చేస్తారని ఆనాడే చెప్పానని గుర్తు చేసుకున్నారు. అనుకున్నట్లుగా ఆయన కోలుకుని రావడం, తొలిసారిగా "అ..ఆ...ఇ...ఈ"లో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
తన పాత్ర గురించి వెల్లడిస్తూ... జేమ్స్‌బాండ్ ఇన్‌స్పిరేషన్‌తో అలా ఉండాలనుకునే జేమ్స్‌బాండ్ పాత్ర పోషిస్తున్నానని అన్నారు. కానీ చివరికి జేమ్స్‌బాండ్ కాదు... జేమ్స్‌బాండ్ లాంటి వాడని అందరూ అనుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. చాలా కామెడీతో దర్శకుడు పాత్రను మలిచారని, ఈ పాత్ర అందరిని అలరిస్తుందనే అనుకుంటున్నానని వెల్లడించారు.
ఏవీఎస్ స్పందిస్తూ... తొలిసినిమాలో పడ్డ టెన్షన్‌ను, మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఈ రోజు పడ్డానని, షూటింగ్‌కు బయలుదేరేటప్పుడే ఫస్ట్ షాట్ ఓకే చేయగలనా? అనే సందేహం కల్గిందని చెబుతూ.. ఇదే రాజ్ కాజిల్‌లో "కుబేరులు" ఆగస్టు 18 గురువారం నాడు షూటింగ్ చేశానని చెప్పారు. మళ్ళీ నెలవేరైనా గురువారం 18న ఇదే దర్ళకుడి చిత్రంలో నటించడం యాదృశ్చికమైనా శుభసూచికంగా ఫీలవుతున్నానని వెల్లడించారు. చాలామంది తనను విశ్రాంతి తీసుకోవచ్చు కదానని సూచనలిస్తున్నారని, కానీ తనకు ఈ వృత్తిలోనే రిలాక్స్ వస్తుందని భావించి సినిమాలు చేస్తున్నానని బదులిచ్చారు.


Click it and Unblock the Notifications











