»   »  మహేష్‌కి వారం ముందు....‘అ..ఆ’, త్రివిక్రమ్ ప్లాన్ అదేనా?

మహేష్‌కి వారం ముందు....‘అ..ఆ’, త్రివిక్రమ్ ప్లాన్ అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న చిత్రం ‘అ...ఆ'...అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ట్యాగ్ లైన్. ఏప్రిల్ 22న అ..ఆ.. మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సమంతతో పాటు కేరళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం' మూవీ ఏప్రిల్ 29న విడుదలవుతోంది. మహేష్ బాబు సినిమాలు ఎలాగూ అనుకున్న సమయానికి రిలీజ్ కావు.... వాయిదా పడే అవాకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ముందే గ్రహించిన త్రివిక్రమ్ ఇలా ప్లాన్ చేసాడని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

A...Aa film on April 22nd

త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకు పని చేస్తున్నారు. కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Trivikram is planning to release his A...Aa film on April 22nd, a week before Brahmotsavam movie, which is slated to release on April 29th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu