బిగ్ ట్విస్ట్: పోలీసుల ముందుకు రామ్ గోపాల్ వర్మ! పరిస్థితి చూస్తుంటే..

వివాదాస్పదం, మాటల్లో వైవిద్యం, సినిమాల్లో వినూత్నం ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ సొంత ఆస్తులు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి ఇతరులకు ఇబ్బంది కలిగించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా సినిమా 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాపై కేసు కూడా దాఖలైంది. ఈ మేరకు నేడు (సోమవారం) పోలీసుల ముందుకు రామ్ గోపాల్ వర్మ రానున్నారని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

వర్మపై పోలీస్ కంప్లైంట్.. నోటీసులు

వర్మపై పోలీస్ కంప్లైంట్.. నోటీసులు

వర్మ రూపొందించిన 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంఎం వారు వర్మపై కేసు నమోదు చేయడం జరిగాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపి డిసెంబర్ 16న తమ ముందు హాజరుకావాలని తెలిపారు పోలీసులు.

ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్..

ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్..

'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో కొన్ని సీన్స్ పై అభ్యంతరం తెలిపిన కేఏ పాల్.. ఈ సినిమాలో తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడం జరిగిందని పేర్కొంటూ వర్మపై కంప్లైంట్‌ ఫైల్ చేశాడు. అదే విధంగా వర్మకు 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సెన్సార్ సర్టిఫికెట్‌ను కేఏ పాల్ నవ్వుతూ ఇస్తున్నట్లుగా ఓ ఫోటో తెగ వైరల్ చేశాడు ఈ వివాదాస్పద దర్శకుడు.

పరువు నష్టం దావా వేస్తా.. పరిస్థితి చూస్తుంటే

పరువు నష్టం దావా వేస్తా.. పరిస్థితి చూస్తుంటే

ఈ మేరకు కేఏ పాల్ నమోదు చేసిన కేసు విషయమై రామ్ గోపాల్ వర్మ నేడు పోలీసుల ముందు హాజరవుతారని సమాచారం. మరోవైపు కేఏ పాల్‌పై తాను పరువు నష్టం దావా వేస్తానని వర్మ చెబుతుండటం చూస్తుంటే.. ఇంతకీ వర్మ పోలీసుల ముందుకు వస్తారా? లేదా? అనేది అనుమానాస్పదం అయింది.

వివాదం పెరిగింది.. లేనిపోని అబాండాలుమోపుతూ

వివాదం పెరిగింది.. లేనిపోని అబాండాలుమోపుతూ

డిసెంబర్ 12న విడుదలైన 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడినప్పటికీ.. వివాదం మరింత పెరిగింది. ఈ సినిమా అంతా ఓ పార్టీకి పూర్తి అనుకూలంగా మలుస్తూ వర్మ రూపొందించారని, మరో పార్టీపై లేనిపోని అబాండాలుమోపుతూ మ్యాజిక్ చేశారని టాక్ నడించింది. చూడాలి మరి వర్మ పోలీస్ కేసు వ్యవహారంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X