twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ. ఎన్టీఆర్ విలన్ చేతికి .. బాల్‌ ధాకరే జీవితం

    By Srikanya
    |

    ముంబై : శివసేన అధినేత, మరాఠా టైగర్ బాల్‌ఠాక్రే జీవిత చరిత్రపై సినిమా రూపొందించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన మరణించి నెల తిరక్కవుుందే ఈ మేరకు సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. మరో ప్రక్క స్టోరీ డిస్కషన్స్ సైతం ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ సినిమాకు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ ముంజ్రేకర్ గతంలో తెలుగులో ఎన్టీఆర్...అదుర్స్ చిత్రంలో విలన్ గా చేసారు.

    అనేక సంవత్సరాల నుంచి మంజ్రేకర్‌కు శివసేనతో సత్సంబంధాలున్నాయి. బాల్‌ఠాక్రే జీవిత చరిత్రపై సినిమా తీయాలనే విషయమై ఆయన ఠాక్రే కుటుంబసభ్యులతో చర్చించారు. అందుకు వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి మంది దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

    ఈ విషయంపై మంజ్రేకర్ మాట్లాడుతూ సినిమా ప్రతిపాదన తన వద్దకు కూడా వచ్చిందన్నారు. ప్రస్తుతం తాను హిందీ చిత్రం షూటింగుతో బిజీగా ఉన్నానని, త్వరలో ఒక మరాఠీ చిత్రం తీస్తానని వివరించారు. అయితే రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అయితే ఈ సీనియర్ నటుడు కొన్నిరోజుల కిందటే ఎమ్మెన్నెస్‌లో సభ్యత్వం తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనే ఠాక్రే కథకు దర్శకత్వం వహించాలని శివసైనికులు భావిస్తున్నారు.

    శివసేన అధినేత బాల్ థాకరే మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఓ సంచలన రాజకీయవేత్త. మరాఠీల ఆత్మగౌరవ నినాదంతో, మరాఠీల హక్కుల పోరాటంతో ఆయన తన ప్రాంతీయ రాజకీయాలను నడిపించారు. హిందూత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయనను శినసైనికులు దాదాపుగా దేవుడిలాగా ఆరాధిస్తారు. ఆయన ఉద్రేక ప్రసంగాలు అనేక మంది అభిమానులను తయారు చేశాయి.

    రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కింగ్ కాలేకపోయారు గానీ కింగ్ మేకర్ అయ్యారు. కొంత మందికి మహారాష్ట్ర టైగర్ సాంస్కృతిక యోధుడు కూడా. తన సైగలతో థాకరే దేశ వ్యాపార రాజధాని ముంబైని శాసించారని అంటారు. థాకరే 1950ల్లో ఆర్‌కె లక్ష్మణ్‌తో పాటు ఫ్రీ ప్రెస్ జర్నల్ ఇంగ్లీష్ డైలీలో కార్టూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మార్మిక్ పేరుతో 1960లో కార్టూన్ వీక్లీని ప్రారంభించారు. పెరుగుతున్న వలసలకు వ్యతిరేకంగా మరాఠీల ఉనికి కోసం, మనుగడ కోసం పోరాడాలని ఆ పత్రిక ద్వారా ఆయన ఉద్బోధిస్తూ వచ్చారు.

    అలాగే ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని చాటిన రాజకీయవేత్తల్లో బాల్ థాకరే ఒక్కరే. అయితే, తమిళనాడు అన్నాదురై, ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు వంటి ప్రాంతీయ దిగ్గజాల రాజకీయాలకు బాల్ థాకరే రాజకీయాలకు చాలా తేడా ఉంది.

    English summary
    There are reports floating around Mumbai that a number of Bollywood filmmakers have been sounded out about the possibility of making a bio-pic on Balasheb Thackeray. However the one name that keeps recurring is that of Mahesh Manjrekar. For various reasons he is being seen as the perfect candidate to make a film on the much-revered leader of the masses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X