twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ లో ఇంకో బయోపిక్... తెలుగుమహిళ దేశం పరువు నిలబెట్టింది.., మీకు గుర్తుందా??

    ఆల్రెడీ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతోంది. దీని తర్వాత మాజీ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత కథతో సినిమా తెరకెక్కేు అవకాశాలు కనిపిస్తున్నాయి.

    |

    ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత చరిత్రలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ దుమ్మురేపుతుందనే అనాలి. ఇక ఇప్పటికే భాగ్ మిల్కా భాగ్, మేరీకామ్, ఎంఎస్ ధోని లాంటి బయోపిక్స్ కోట్ల రూపాయలు కొల్లగొట్టడమే కాకుండా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాయి. ఈ ట్రెండ్ ప్రస్తుతం కంటిన్యూ అవుతూనే.. అమిర్ ఖాన్ 'దంగల్', క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ లు సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈ నెల 23న విడుదల కాబోతున్న 'దంగల్' బయోపిక్స్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి తెర తీస్తుందని భావిస్తున్నారు.

    దీని తర్వాత ఇండియాలో మరిన్ని బయోపిక్స్ తెరకెక్కడం ఖాయం. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా నార్త్ ఇండియన్ క్రీడాకారుల బయోపిక్సే వచ్చాయి. అల్రెడీ సక్సెసైన వ్యక్తుల జీవితాన్ని చూపించడమే కాబట్టి స్టోరీ ఇన్ స్టాంట్ గా దొరికినట్టే. ఆ కథని ఆడియెన్స్ కి కనెక్టయ్యేలా కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే చాలు విజయం వరించేస్తోంది. ఈ సౌలభ్యం ఉంది కాబట్టే తీసేవాళ్లూ.. చేసేవాళ్లందరూ బయోపిక్స్ మీద మోజు చూపిస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఫోకస్ తెలుగు స్పోర్ట్స్ పర్సన్స్ మీదికి మళ్లుతోంది. ఇక ఇప్పుడేమో ఈ లిస్టులోకి మరో క్రేజీ బయోపిక్ వచ్చి చేరుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా మన తెలుగుతేజం, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ కావడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ కు దారితీసింది.

     కరణం మల్లీశ్వరి జీవిత కథ:

    కరణం మల్లీశ్వరి జీవిత కథ:

    ఆల్రెడీ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతోంది. దీని తర్వాత మాజీ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత కథతో సినిమా తెరకెక్కేు అవకాశాలు కనిపిస్తున్నాయి.అందుకే ఇప్పుడు మల్లీశ్వరీ లైఫ్ మీద దర్శకుల ఫోకస్ పడింది. సంజనా రెడ్డి అనే కొత్త డైరెక్టర్ మల్లీశ్వరీ జీవితం మీద రీసెర్చ్ చేసి స్ర్కిప్ట్ తయారు చేసుకోని మాజీ ఒలింపిక్ విన్నర్ కి కూడా వినిపించింది. మల్లీశ్వరీ అనుమతి సైతం ఇవ్వడంతో త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది.

    పరువు నిలిపిన ఘనత:

    పరువు నిలిపిన ఘనత:

    ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే ఈ చిత్రంలో మల్లీశ్వరీగా హీరోయిన్ సోనాక్షీసిన్హా కనిపించే అవకాశముందట. 2000 నాటి సిడ్నీ ఒలింపిక్స్ లో భారత్ కు ఏకైక పతకం అందించి.. పరువు నిలిపిన ఘనత మల్లీశ్వరిదే. ఆ ఒలింపిక్స్ లో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది. శ్రీకాకుళంలోని ఓ పల్లెటూరి నుంచి వచ్చి దేశం గర్వించే ప్రదర్శన చేసిన మల్లీశ్వరి జీవితంలో అనేక మలుపులున్నాయి.

    సోనాక్షి సిన్హా:

    సోనాక్షి సిన్హా:

    సంజనారెడ్డి అనే ఆవిడ మల్లీశ్వరి జీవితంపై పరిశోధించి సినిమా స్క్రిప్టు తయారు చేసిందట. ఈ సినిమాకు మల్లీశ్వరి కూడా సంతోషంగా ఒప్పుకుందట. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో కరణం మల్లీశ్వరి పాత్రకు సోనాక్షి సిన్హాను ఎంపిక చేసినట్లు సమాచారం.

    చరిత్ర సృష్టించింది:

    చరిత్ర సృష్టించింది:

    ఆంధ్రప్రదేశ్ ఉక్కు మహిళగా పేరొందిన కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో దేశం గర్వించేలా ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి కావడం విశేషం. మల్లీశ్వరి తన పదేళ్ల కెరీర్‌లో మొత్తం 11 బంగారు, మూడు రజత పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.

    మల్లీశ్వరి స్ఫూర్తితో :

    మల్లీశ్వరి స్ఫూర్తితో :

    ముఖ్యంగా ఒక భారతీయ మహిళగా పురుషాధిక్య సమాజంలో వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడలను సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయం కాదు. ఒక రకంగా కరణం మల్లీశ్వరి స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారంటే అతిశయోక్తి కాదు.

    తొలి మహిళా అథ్లెట్‌:

    తొలి మహిళా అథ్లెట్‌:

    సరిగ్గా 16 ఏళ్ళ క్రితం అసమాన పోటీతత్వంతో ఒలింపిక్స్‌లో తనదైన ముద్ర వేసింది. శ్రీకాకుళంలోని మారుమూల గ్రామం నుంచి ఎదిగిన ఆమె.. ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో పతకం నెగ్గిన తొలి అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. ఆమె ఎవరో కాదు మన తెలుగు తేజం కర్ణం మల్లీశ్వరి. సిడ్నీ ఒలింపిక్స్‌లో మెరిసిన మల్లీశ్వరి..
    భారత్‌ తరఫున ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచింది.

    ప్రాక్టీస్‌లోనే 240 కేజీల బరువు:

    ప్రాక్టీస్‌లోనే 240 కేజీల బరువు:

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లీశ్వరికి నలుగరు అక్కా చెల్లెళ్లు. యాధృచ్చికంగా మల్లీశ్వరి సిస్టర్స్‌ అందరూ వెయిట్‌ లిఫ్టర్లే. క్రీడా నేపథ్యమున్న కుటుంబం కావటంతో స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవటంలో మల్లీశ్వరి ఇబ్బంది పడలేదనే చెప్పాలి. ప్రాక్టీస్‌లోనే సుమారు 240 కేజీల బరువును అవలీలగా ఎత్తేసేది.

    2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో:

    2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో:

    దీంతో బరిలోకి దిగితే చాలు.. పతకం ఖాయం అన్నట్టు ఉండేది పరిస్థితి. అప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌ సహా ఆసియా గేమ్స్‌లోనూ సత్తా చాటిన మల్లీశ్వరి.. ఒలింపిక్స్‌ పతకంతోనే రోల్‌ మోడల్‌గా ఎదిగింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ను మహిళలకూ ప్రవేశపెట్టడంతో బెర్త్‌ దక్కించుకున్న మల్లీశ్వరి.. అనూహ్యంగా స్వర్ణం చేజార్చుకున్నది.

    వెయిట్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం :

    వెయిట్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం :

    భారీ బరువుల్ని అవలీలగా ఎత్తే మల్లీశ్వరి.. సిడ్నీలో కాంస్యంతో సరిపెట్టుకున్నది. దీంతో వెయిట్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం సాధించిన మహిళా అథ్లెట్‌గా మల్లీశ్వరి చరిత్ర సృష్టించింది. ఇక మల్లీశ్వరికి మునుపెవ్వరూ (మహిళలు) ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తీసుకురాలేదు. సిడ్నీ కాంస్యంతో మల్లీశ్వరి భారత క్రీడారంగంపై తన ముద్ర వేసింది. మొక్కవోని దీక్షతో.. ఒలింపిక్‌ పతకం సాధించి ఔరా అనిపించింది.

    మల్లీశ్వరి మాత్రమే మెడల్‌తో తిరిగొచ్చింది:

    మల్లీశ్వరి మాత్రమే మెడల్‌తో తిరిగొచ్చింది:

    2000 సిడ్నీ ఒలిం పిక్స్‌లో కరణం మల్లీశ్వరి సాధించిన పతకం.. భారత క్రీడా రంగంలో విప్లవా త్మక మార్పుకు నాంది పలికింది. అప్పటి వరకూ మహిళలు క్రీడల్లో మెరిసినా.. పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ మల్లీ శ్వరి కాంస్య కాంతులతో ఆమె ఒక్క సారిగా యువతకు రోల్‌ మోడల్‌గా అవతరించింది. దీనికి తోడు సిడ్నీ నుంచి మల్లీశ్వరి మాత్రమే మెడల్‌తో భారత్‌కు తిరిగొచ్చింది.

    గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా:

    గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా:

    మల్లీశ్వరి మెడల్‌తో మురిసిన భారత్‌.. ఆమెను 'గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా' గా అభివర్ణించింది. అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి.. మల్లీశ్వరిని గొప్పగా కీర్తీంచటం ఆమె జీవితంలో మరుపురాని సన్నివేశ మని చెబుతుంటుంది. ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు స్పోర్ట్స్‌లో తమదైన జోరు చూపవచ్చు కానీ భారత క్రీడా రంగంలో అమ్మాయిల ముద్రకు నాంది పలికింది మాత్రం మన తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి.!

    కెరీర్‌ అనూహ్యంగా ముగిసింది:

    కెరీర్‌ అనూహ్యంగా ముగిసింది:

    ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు మెడల్‌ సాధించిన మూడో అథ్లెట్‌ మల్లీశ్వరి. అంతకుముందు రెజ్లింగ్‌లో కశబ జాదవ్‌ (1952 ఒలింపిక్స్‌), మెన్స్‌ సింగిల్స్‌ టెన్నిస్‌లో లియాండర్‌ పేస్‌ (1969 అట్లాంటా ఒలింపిక్స్‌) మాత్రమే కాంస్యం కైవసం చేసుకు న్నారు. ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ సహా భారత క్రీడా రంగంపై చెరగని ముద్ర వేసిన మల్లీశ్వరి కెరీర్‌ అనూహ్యంగా ముగిసింది.

    25 ఏళ్ళ వయసులోనే కెరీర్‌కు వీడ్కోలు :

    25 ఏళ్ళ వయసులోనే కెరీర్‌కు వీడ్కోలు :

    సిడ్నీ నుంచి కాంస్యంతో తిరిగొచ్చిన మల్లీశ్వరి.. 25 ఏళ్ళ వయసులోనే కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 2002 మాంచెస్టర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌తో పునరాగమనం చేయాలని భావించినా.. ఆమె తండ్రి మరణంతో ప్రాక్టీస్‌ సాధ్యం కాలేదు. దీంతో మల్లీశ్వరి కెరీర్‌ ఉజ్వల దశలోనే అనూహ్యంగా ముగిసింది.

    దురదృష్టం వెంటాడింది:

    దురదృష్టం వెంటాడింది:

    కాంస్యం సాధించడంతోనే సరిపెట్టకుండా తర్వాతి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. బరువు తగ్గి వెయిట్ కేటగిరీ 69 కేజీలనుంచి 63 కేజీలకు మారింది.. అయితే కీలక సమయంలో దురదృష్టం వెంటాడింది. స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో బరువు ఎత్తే సమయంలోనే వెన్నుపూస పట్టేసింది. దాంతో పోటీనుంచి ఒక్కసారిగా తప్పుకోవాల్సి వచ్చింది.

    బాగా ఇబ్బంది పడ్డా:

    బాగా ఇబ్బంది పడ్డా:

    నిజానికి వెన్ను గాయం మల్లీశ్వరిని అంతకు ముందు చాలా రోజులనుంచే బాధిస్తోంది. కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడ్డా చికిత్స తీసుకుంటూనే ప్రాక్టీస్ చేసిందట.కోచ్‌లు కూడా అప్పటి వరకు కోలుకోగలవని ప్రోత్సహించారు. ఆ నమ్మకంతోనే ఏథెన్స్ వెళ్ళింది. కానీ సాధించలేకపోయింది ఆ తర్వాత మళ్లీ లిఫ్టింగ్ చేస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు రావచ్చని డాక్టర్లు హెచ్చరించడంతో ఏథెన్స్ తర్వాత ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. అలా కరణం మల్లీశ్వరి కెరీర్ ఆగిపోయింది. ఇప్పుడు మల్లీశ్వరి జీవితాన్ని మళ్ళీ తెరమీద చూడటం మనకూ ఆనందమే కదా..

    English summary
    It’s raining biopics all over. In recent times, a series of films released, especially on sportspersons. Now, another biopic is all set to begin, and this time it will be on weightlifter Karanam Malleswari, India’s first woman Olympic medal winner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X