twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనూష్కను అడ్డం పెట్టి భూమిక బిజెనెస్

    By Srikanya
    |

    హాట్ స్టార్ అనుష్క ఈ నెల ఏడవ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నారు.అందుకు ఆమె స్నేహితురాలు భూమిక ఓ ప్రత్యేకమైన గిప్ట్ ను ఇవ్వనున్నారు.అదేమిటంటే తను నిర్మించిన చిత్రాన్ని ఆ రోజున తమిళంలో ఆడియో విడుదల చేయటం.భూమికతో సత్యభామ చిత్రాన్ని డైరక్ట్ చేసిన ద ర్శకుడు శ్రీహరి తెలుగులో తకిటతకిట అనే చిత్రాన్ని నిర్మించారు.అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.అయితే అందులో క్రేజ్ కోసం అనుష్క, నాగార్జునలను గెస్ట్ రోల్స్ లో చేయించారు.ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి ఇప్పుడు తుళ్లి ఎళుందదు కాదల్ పేరుతో విడుదల చేస్తున్నారు.ఈ చిత్రం ఆడియోను నటి అనుష్క పుట్టిన రోజు కానుకగా ఈ నెల ఏడవ తారీఖున విడుదల చేయనున్నారు.అయితే అనుష్క తుళ్లి ఎళుందదు కాదల్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే విషయం సందేహమేనంటున్నారు.ఆమె తెలుగు ఢమురకం చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.అయితే ఎలాగైనా ఆ సమయానికి అనుష్కను చెన్నైకు రప్పించే ప్రయత్నాలను భూమిక చేస్తున్నారు.అనూష్క చేతులు మీదుగా ఆడియోను విడుదల చేసి ఆ సినిమాకు క్రేజ్ తెద్దామని,తమిళంలో అనూష్కకు ఉన్న క్రేజ్ ని వినియోగించుకుందామని భూమిక ప్లాన్ చేస్తున్నారు.ఇదంతా భూమిక తనకూ అనూష్కకు ఉన్న స్నేహాన్ని అడ్డం పెట్టి చేస్తున్న బిజెనెస్ అంటున్నారు.

    English summary
    Anushka will be celebrating her birthday on November 7, and Tollywood director Sreehari Nanu and Bhumika Chawla have already decided what they will be gifting her.The two are gearing up to launch the audio of Thulli Ezhunthathu Kadhal (TEK), in which Anushka has done a special appearance, on her birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X