వరుణ్ సందేశ్ హీరోగా దిల్‌రాజు నిర్మించిన 'కొత్తబంగారులోకం' చిత్రంపై రాష్ట్ర పురావస్తు శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖలోని ఓ బౌద్ద క్షేత్రంలో వారు అనుమతి లేకుండా షూటింగు జరిపారని అందుకుగాను నిర్మాతకు నోటీసు పంపనున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు ఆధ్యాత్మికక్షేత్రంలో నృత్యాలు చిత్రీకరించటంపై ఇంటాక్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ చిత్రం రిలీజయి నాటి నుండీ హిట్ టాక్ తో ముందుకెళ్తోంది. శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన ఈ సినిమా టీనేజ్ రొమాన్స్,పెద్దల పట్టింపులు మద్య జరిగే సంఘర్షణ ఆధారంగా రూపొందింది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్వేతా ప్రసాద్ ఇప్పటికే చాలా ఆఫర్స్ సంపాదించుకుంది. దిల్ రాజు మరో సారి వరుణ్ సందేశ్ చేస్తున్నారు. మరో చరిత్రను మరో సారి రూపొందించబోతున్నారు. ఈ కాలానికి తగినట్లు మార్పులు జరిపి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.