Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?
Ram Gopal Varma: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఐటీ చట్టం లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇంతకీ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయడానికి పెట్టడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే
ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. సమాజం సిగ్గుపడే అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ పోలీసులు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురి పై కేసులు అరెస్టులు జరిగిన విషయం తెలిసింది.ప్రధానంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీపై నాయకులపై అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టులు చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పలువురు వైసిపి నేతలు ఇతర ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా (vyuham movie) ప్రమోషన్లలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను వ్యక్తిత్వాన్ని కించపర్చేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని ఆరోపించారు.
ఈ విషయంపై మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఈమేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామంతో ఆర్జీవీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ కేసులపై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ కేసులో ఆర్జీవీ అరెస్టు చేస్తారా? అనేది కూడా హాట్ టాఫిక్ గా మారింది.

డైరెక్టర్ ఆర్జీవీ దర్శకత్వంలో వ్యూహం తెరకెక్కింది. ఈ మూవీ 2024 మార్చి 2న ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఏపీలో జరిగిన పరిణామాలను ఈ సినిమాలో చూపారు. వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవరకు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ఇందులో చూపించారు.


Click it and Unblock the Notifications











