twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊపిరి పీల్చుకున్న రజినీకాంత్: "కాలా" వివాదం లో ఊరటనిచ్చిన మద్రాస్ హైకోర్ట్ తీర్పు

    తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘కాలా’ చిత్రంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది.

    |

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'కాలా' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చాలా బాగా వస్తోందని చిత్ర నిర్మాత ధనుష్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించారు. అయితే '2.0' విడుదల ఏప్రిల్‌కు వాయిదా పడిందని.. 'కాలా'ను జనవరిలోనే రిలీజ్ అవుతుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో కాలా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. '2.0' విడుదలయ్యాకే 'కాలా' విడుదలవుతుందని స్పష్టం చేశారు. దీంతో కాలా పై ఉన్న అనుమానులు తొల‌గిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఫ్యాన్స్ అటెన్ష‌న్ అంతా 2.0 పై మ‌ళ్లింది.

    Recommended Video

    Rajinikanth's Robo 2.0 Audio Launch Date Is Out ఖర్చు తెలిస్తే షాకవుతారు!
    హైకోర్టును ఆశ్రయించారు

    హైకోర్టును ఆశ్రయించారు

    ఈ విషయం పక్కన పెడితే ఈ చిత్ర కథ తనదే అయినా అది చౌర్యానికి గురైందనీ, తనకు ఇవ్వాలసిన పరిహారం తెరకెక్కిస్తున్నారంటూ చెన్నైకి చెందిన రాజశేఖర్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం నటుడు రజనీకాంత్‌, నిర్మాత ధనుష్‌, దర్శకుడు రంజిత్‌, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలికి నోటీసులు జారీ చేసింది.

     వ్యక్తిగతలాభాలకోసమే

    వ్యక్తిగతలాభాలకోసమే

    దీనిపై నటుడు రజనీకాంత్‌ దాఖలు చేసిన పిటీషన్‌లో... ఈ చిత్ర కథను ఎవరి వద్ద నుంచీ తస్కరించలేదని, చిత్రానికి ‘కాలా' పేరును ఎప్పుడో నిర్ణయించి ఫిల్మ్‌ ఛాంబర్‌లో కూడా పేరును నమోదుచేశామని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చిన వివాదం కేవలం వ్యక్తిగతలాభాలకోసమే మోపబడించనికూడా రజినీ ఆరోపించారు.

     ఏడాదిలోపు చిత్రాన్ని నిర్మించాలని

    ఏడాదిలోపు చిత్రాన్ని నిర్మించాలని

    పిటీషన్‌దారుడైన రాజశేఖర్‌ ‘కరికాలన్‌' అనే టైటిల్‌ను నమోదుచేసిన ఏడాదిలోపు చిత్రాన్ని నిర్మించాలని, కానీ, అలా చేయకపోగా, 2006లో టైటిల్‌ను రెన్యువల్‌ చేయలేదని గుర్తుచేశారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన హక్కులను అడిగే అర్హత అతనికి లేదని, కేవలం పబ్లిసిటీ కోసమే కోర్టును ఆశ్రయించారని రజనీ బదులు పిటీషన్‌లో పేర్కొన్నారు.

     160 కోట్ల వ్యయంతో

    160 కోట్ల వ్యయంతో

    ‘కాలా' చిత్రాన్ని నిర్మిస్తున్న వండర్‌ఫుల్‌ సంస్థ కోర్టులో దాఖలు చేసిన బదులు పిటీషన్‌లో... రూ.160 కోట్ల వ్యయంతో చిత్రాన్ని నిర్మించి వచ్చే యేడాది విడుదల చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కేవలం డబ్బు ఆశించి రాజశేఖర్‌ తమపై అభియోగాలు మోపారని, ఆయనకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధాలు లేవని సంస్థ పేర్కొంది.

    English summary
    Big relief for Rajinikanth, A Chennai court today declined to stop the production of superstar Rajinikanth's upcoming movie Kaala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X