వర్మపై కేసు: బాలయ్యకు మానసిక వైద్యం అంటూ కామెంట్.. అలీ, పవన్ గొడవపై కూడా!
Recommended Video
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తెలంగాణలో ఈ చిత్రం విడుదలైనప్పటికీ ఏపీలో మాత్రం కోర్టు వివాదం కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందనే ఆరోపణలే సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం. ఈ విషయంలో దర్శక నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేక పోయింది. మరి వర్మ ఆ ప్రస్టేషన్లో ఉన్నాడో లేక.. మరో కారణమో తెలియదు కానీ ఎన్నికల ముగిసిన అంనంతరం తన ట్విట్టర్లో పలు వివాదాస్పద ట్వీట్స్ చేశారు.

రామ్ గోపాల్ వర్మపై కేసు
రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్విట్టర్ పోస్టులపై హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బాచుపల్లికి చెందిన దేవిబాబు చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, బాలయ్యను అవమానించే విధంగా ట్వీట్స్ చేసిన వర్మపై వెంటనే వర్మపై చర్యలు తీసుకోవాలని, అతడు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదలబోము అని దేవిబాబు స్పష్టం చేశారు.
వర్మ చేసిన వివాదాస్పద ట్వీట్స్ ఇవే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరినట్లు కొన్ని మార్ఫింగ్ ఫోటోలను వర్మ ట్వీట్ చేశారు. వర్మ చేసిన ఈ ట్వీట్లపై చంద్రబాబు అభిమానులు మండి పడుతున్నారు.
బాలయ్య బాబు గురించి దారుణంగా
జగన్ ప్రభుత్వంలో చంద్రబాబుకు రూ. 3వేల ఫించిన్, లోకేష్‌కి సచివాలయంలో జాబ్, బాలయ్యకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అంటూ ఓ పిక్ షేర్ చేసిన వర్మ.... ‘బాలయ్యకు మెరుగైన వైద్యం కాదు.. మెరుగైన మానసిక వైద్యం' అంటూ కామెంట్స్ పెట్టారు.
హీరో కమెడియన్‌లా... కమెడియన్ హీరోలా: పవన్-అలీ ఇష్యూపై వర్మ
‘‘తొలిసారి ఒక కమెడియన్ హీరోలా మాట్లాడటం చూశాను. కానీ ఆ హీరో కమెడియన్‌లా మాట్లాడారు' అంటూ ఇటీవల జరిగిన అలీ-పవన్ వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా అలీ కౌంటర్ ఇచ్చిన వీడియో షేర్ చేశారు.

అలీ, పవన్ కళ్యాణ్ గొడవ
కొన్ని రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో అలీ గురించి పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.... వెంటనే అలీ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ‘‘నా స్నేహితుడైన అలీకి సాయం చేశాను, కానీ నన్ను మోసం చేశాడు'' అంటూ పవన్ ఆరోపించగా... అలీ కౌంటర్ ఇస్తూ ‘నేను కష్టపడి పైకొచ్చాను... మీ సాయంతో కాదు' అని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











