డార్క్ స్కిన్ బ్యూటీ చిరు కోరిక
ఆకాశంలోని కోట్ల నక్షత్రాలలో చందమామా ఒక్కటే ఎలాగో సింధు పేర్లలో సింధుమీనన్ అలాగే. డార్క స్కిన్ బ్యూటీ చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది. అందమైన చిరునవ్వుతో అందమైన కళ్లతో చూడగానే ఆహా అనిపిస్తుంది ఈ మళయాలీ బ్యూటి 'సిందుమీనన్. అట్లని, నటన విషయంలో ప్రతిభకు కొదువేమీ లేదు. సిందుమీనన్ తను ఎంత క్యూట్ గా ఉంటుందో అంతే అందంగా సినిమాను ఎంచుకొంటుంది తనకు కథ, స్ర్కిప్ట్, సినిమాలో తన పాత్ర నచ్చిన వాటినే ఎంచుకొంటుంది'చందమామ",'భద్రాచలం"లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచేసుకొంది. చందమామ తర్వాత దరిదాపు 30 సినిమాల దాకాఎన్నో అవకాశాలు వచ్చినా తను ఒప్పుకోలేదట.
సింధు తెలుగులో 'త్రినేత్ర" సినిమాకి తెలుగు అకాడమి అవార్డును దక్కించుకొన్నారు. సింధుకు నిర్మాత అవ్వలనే చిరు కోరిక ఉంది. నిర్మాతనై తను ఒక 'ఫీమేల్ ఒరియంటెడ్" సినిమా తీయాలనే అలోచనలో ఉన్నది. సింధు తమిళ, తెలుగు కన్నడ, మలయాళం సినిమాలలో నటించి మంచి మార్కులు సంపాదించుకొన్నది. ఐతే తను బాడీ లాంగ్వేజిలో ఇతర నటీమణులతో పోల్చుకుంటే తను ఎందుకు అలా చేయకూడదని ఫీలౌవుతోంది. ఇప్పుడు తన క్రేజ్ తో, డిఫరెంట్ పాత్రలతో ఎలా ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టబోతుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











