దగ్గుబాటి రాణా కోసం ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేసిన క్రిష్
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల 'లీడర్" చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేసిన దగ్గుబాటి రాణా త్వరలో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. తొలిచిత్రం 'లీడర్" తర్వాత తెలుగులో రాణా చేసిన నేను నా రాక్షసి, హిందీలో నటించిన 'దమ్ మారో దమ్" చిత్రాలు అతనికి చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం 'డిపార్ట్ మెంట్"లో నటిస్తున్న ఈ యువ కథానాయకుడు తెలుగులో ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో 'నా ఇష్టం" చిత్రంలో నటిస్తున్నాడు. జెనీలియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యునెటైడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు.
కాగా రాణా త్వరలో గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. తన తొలి రెండు సినిమాల తరహాలోనే మూడో చిత్రాన్ని కూడా క్రిష్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింబోతున్నాడని తెలిసింది. క్రిష్ ఆ చిత్రాన్ని తానే స్వయంగా ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తానే నిర్మించదలిచారు. తప్పకుండా రాణాకి హీరోగా పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని రాణా సన్నిహితులు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











