For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రికి రమ్మనేవాడు, సెక్స్ కోసం వేధించేవాడు: డైరెక్టర్ గురించి హీరోయిన్

    By Bojja Kumar
    |
    రాత్రికి రమ్మనేవాడు,సెక్స్ కోసం వేధించేవాడు.. నోరు విప్పిన హీరోయిన్

    సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సెక్సువల్ వేధింపులు ఎదుర్కొంటున్న అంశం తరచూ వింటూనే ఉన్నాం. హాలీవుడ్లో ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తుల వల్ల తాము ఎదుర్కొన్న సెక్సువల్ వేధింపుల గురించి పలువురు నటీమణులు ఓపెన్ అవుతున్నారు.

    తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తనకు ఎదురైన సెక్సువల్ వేధింపుల గురించి ఓ ఆంగ్లపత్రికతో పంచుకుంది. తాను సినిమా రంగానికి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడి వల్ల ఎదుర్కొన్న సెక్సువల్ హరాస్మెంట్ గురించి ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం ఆమె బయట పెట్టలేదు.

     పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది

    పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది

    కొన్ని సినిమా షూటింగ్స్ జరిగే సెట్స్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ పైస్థాయిలో ఉండేవారిలో ఫ్యూడల్ భావాలు ఉంటాయి. లైంగిక వేధింపులు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి విషయాల్లో బాధితులు నోరు మెదపకుండా ఉంటారన్న సంగతి అక్కడున్న అందరికీ తెలుసు.... అని స్వరభాస్కర్ చెప్పుకొచ్చారు.

     ఓ దర్శకుడు నన్ను వేధించాడు

    ఓ దర్శకుడు నన్ను వేధించాడు

    నా కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా షూటింగ్ కోసం 56 రోజులు అవుట్ డోర్ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో చిత్ర దర్శకుడు నన్న వేధించేవాడు. రోజంతా నటించడం లేదని తిడుతూ, రాత్రయ్యేసరికి తన గదికి రమ్మని పిలుస్తుండేవాడు. సీన్ గురించి మాట్లాడాలని చెబుతూ మద్యం తాగి వచ్చేవాడు.... అని స్వర భాస్క్ గుర్తు చేసుకున్నారు.

     ప్రేమ, సెక్స్ గురించి మాట్లాడేవాడు

    ప్రేమ, సెక్స్ గురించి మాట్లాడేవాడు

    నా వద్ద ఎప్పుడూ ప్రేమ, సెక్స్ గురించి మాట్లాడేవాడు. కౌగిలించుకోవాలని అడిగేవాడు. చాలా భయం వేసేది. అతడి మనసులోని చెడు ఉద్దేశ్యం అర్థమై సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాను. విషయం ఎగ్జిక్చూటివ్ ప్రొడ్యూసర్ కు చెప్పడంతో నాకు రక్షణ కల్పించారు... అని స్వర భాస్కర్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

     ధైర్యంగా ఉండాలి

    ధైర్యంగా ఉండాలి

    మహిళలు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. వర్క్ ప్లేసులో ఇలాంటి అనుభవాలు ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అవసరం అయితే పోరాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి లొంగకూడదు అని స్వర భాస్కర్ వ్యాఖ్యానించారు.

     స్వర భాస్కర్ మూవీస్

    స్వర భాస్కర్ మూవీస్

    ప్రస్తుతం స్వర భాస్కర్ బాలీవుడ్ మూవీ ‘వీరే ది వెడ్డింగ్' అనే చిత్రంలో నటిస్తోంది. మే 18న తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Bollywood actress Swara Bhaskar has recounted an incident that happened to her years ago. A film director repeatedly stalked her and subtly made several sexual advances for weeks during an outdoor shooting schedule. Swara would be asked to meet him in his hotel room to discuss a scene. And when the unsuspecting actor would go to see him, the director would alrady be drunk. This would scare her. More than a few times, she would pretend to have already fallen into sleep just to avoid phone calls from him!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X