ప్రభాస్ పక్కనే అనుష్క.. వైరల్ అవుతున్న ఫోటో.. వదిలేలా లేరుగా!

డార్లింగ్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో జాతీయస్థాయిలో పాపులర్ అయిన హీరో. బాహుబలి చిత్రంతో ప్రభాస్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. బాహుబలి చిత్రంలో ప్రభాస్, అనుష్క జోడి అదుర్స్ అనిపించింది. బాహుబలి మాత్రమే కాదు గతంలో ప్రభాస్, జంటగా నటించిన బిల్లా, మిర్చి లాంటి చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. దీనితో ప్రభాస్, అనుష్క కాంబినేషన్ అంటే ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. తాజాగా అభిమానులు సృష్టించిన అనుష్క, ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిరాశపడ్డ అభిమానులు

నిరాశపడ్డ అభిమానులు

కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షో బాగా పాపులర్ అయింది. కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ఈ షోకు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరవుతున్నారు. తొలిసారి టాలీవుడ్ నుంచి రాజమౌళి, రానా, ప్రభాస్ ఈ షోకు హాజరు కావడం విశేషం. అభిమానులు కరణ్ జోహార్ పై తీవ్రంగా ఒత్తిడి తెస్తుండడంతో ఈ బాహుబలి త్రయాన్ని ఆహ్వానించారు. కానీ ఈ షోలో దేవసేన అనుష్క లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనయ్యారు.

 వదిలేలా లేరుగా

వదిలేలా లేరుగా

ప్రభాస్,అనుష్క ప్రేమలో ఉన్నారంటూ అనేక రూమర్స్ ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్ ఈ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చాడు. అనుష్కతో డేటింగ్ చేస్తున్నావా అని కరణ్ జోహార్ ప్రశించగా.. అది అసత్య ప్రచారం అంటూ ప్రభాస్ తెలిపాడు. అయినా కూడా అభిమానులు మాత్రం ప్రభాస్, అనుష్కని వేరుగా చూడడం లేదు. కాఫీ విత్ కరణ్ షోలోకి కూడా అనుష్కని తీసుకుని వచ్చి ప్రభాస్ పక్కనే కూర్చోబెట్టేశారు. ఫోటోని ఎడిటింగ్ చేయడం ద్వారా అనుష్క, ప్రభాస్ పక్కనే ఉన్నట్లు చిత్రీకరించారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క, ప్రభాస్ పై ఉన్న అభిమాని ఫ్యాన్స్ ఇలా చూపిస్తున్నారు. అనుష్క బాగమతి తరువాత మరో చిత్రంలో నటించలేదు. దీని గురించి కూడా పుకార్లు మొదలయ్యాయి. బాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క.. మాధవన్ సరసన ఓ తమిళ చిత్రంలో నటించబోతోంది.

ప్రభాస్‌తో మళ్ళీ రొమాన్స్

ప్రభాస్‌తో మళ్ళీ రొమాన్స్

ప్రభాస్, అనుష్క గురించి వస్తున్న మరో ఆసక్తికర వార్త ఏంటంటే.. ఈ జంట మరోమారు వెండితెరపై మెరవబోతోందట. రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 1960 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ ప్రేమ కథగా రాబోతోంది. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో అనుష్క నటించబోతోంది ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ , అనుష్క గురించి ప్రచారంలో ఉన్న అనేక రూమర్స్ లో ఇది కూడా ఒకటేనా లేక వాస్తవం ఉందా అనేది తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X