మీరు నమ్రతను... మా ఆయన నన్ను... మహేష్ ‘హంబుల్’ ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'హంబుల్' పేరుతో తన సొంత బ్రాండ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మహేష్ బాబు బ్రాండ్ దుస్తులు, క్యాజువల్ వేర్ అభిమానులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ బ్రాండ్ లాంచింగ్ సందర్భంగా మహేష్ బాబు మీడియాతో ఇష్టాగోస్టిగా చర్చించారు.

మహేష్ బాబు టీమ్ కొంతకాలం పాటు రీసెర్చ్ చేసి 'హంబుల్' అనే పేరు ఫైనల్ చేశారట. టీమ్ సభ్యుడు భార్గవ్ ఈ విషయమై మాట్లాడుతూ... ఈ బ్రాండ్ గురించి అనుకున్నపుడు, మహేష్ సర్‌ను కలిసినపుడు ఈ పేరు కేవలం రాండమ్‌గా పెట్టలేదు. చాలా మంది మహేష్ బాబు అభిమానులతో చర్చించిన తర్వాతే ఈ పేరు ఫైనల్ చేసినట్లు తెలిపారు.

చాలా రీసెర్చ్ చేశాం

చాలా రీసెర్చ్ చేశాం

మహేష్ బాబు అంటే ఏమిటి? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అనేది రీసెర్చ్ చేసి... రెండు మూడు ఐడియాలు తీసుకున్నాం. వాటి నుంచి వచ్చిన పేరు ‘హంబుల్'. మహేష్ బాబు వ్యక్తిత్వానికి రిప్లెక్షన్ లా ఉంటుంది కాబట్టే ఈ పేరు ఎంచుకున్నాం. నిజంగానే ఆయన హంబుల్, డౌన్ టు ఎర్త్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినప్పటికీ హంబుల్‌గా, వినమ్రంగా ఉంటారు... అని భార్గవ్ తెలిపారు.

అది అనుకోకుండా వచ్చిన ఐడియా

అది అనుకోకుండా వచ్చిన ఐడియా

హంబుల్ లోగోలో ఎంబి అండర్ లైన్ చేయాలని ముందు అనుకోలేదు. మా గ్రాఫిక్ టీమ్ దాన్ని అండర్ లైన్ చేసి ఒక కాపీ పంపడంతో ఇది బావుంది అనిపించింది. అక్కడి నుంచి ఈ ఐడియా మొదలైంది. ఇది అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని పెట్టింది కాదని స్పష్టం చేశారు.

మీరు నమ్రతను చేసుకోవడం వల్లే మా ఆయన నన్ను చేసుకున్నారు

మీరు నమ్రతను చేసుకోవడం వల్లే మా ఆయన నన్ను చేసుకున్నారు

ఓ లేడీ రిపోర్టర్ మాట్లాడుతూ... ‘నా భర్త నన్ను నమ్రత అని పిలుస్తారు, నేను ఆయన్ను మహేష్ అనిపిలుస్తాను. వాస్తవానికి మా పేర్లు అవి కాదు. ఆయన మీకు పెద్ద అభిమాని, మీరు మహారాష్ట్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన నన్ను ఎంచుకున్నారు. నేను కూడా మహారాష్ట్రకు చెందిన అమ్మాయినే'.... అనడంతో సభలో నవ్వులు పూశాయి.

అభిమానిని స్టేజీ మీదకు పిలిచి...

అభిమానిని స్టేజీ మీదకు పిలిచి...

‘హంబుల్' లాంచింగ్ ఈవెంట్ జరుగుతుండగా ఓ వ్యక్తి మైక్ అందుకుని... ప్రశ్నలు ఏమీ లేవు, నేను మీకు చిన్నప్పటి నుంచి పెద్ద అభిమానిని, మొదటిసారి లైవ్‌లో చూస్తున్నాను, మీతో ఒక్క ఫోటో దిగాలని ఉంది అని అడగటంతో.... మహేష్ బాబు వెంటనే వచ్చేయ్ అంటూ అతడిని స్టేజీమీదకు పిలిచి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X