అభిమానిని నిరాశపరిచిన జూ ఎన్టీఆర్, పెళ్లికి ఆహ్వానించకుండా..
ప్రముఖ తెలుగు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ అభిమానిని నిరాశపరిచారు. తనను జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి ఆహ్వానించకపోవడంపై కృష్ణా జిల్లా నందిగామకు చెందిన సాంబశివ రావు అనే అభిమాని తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ముందు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. సాంబశివరావు స్వర్గీయ ఎన్టీ రామారావు అభిమాని. ఎన్టీఆర్ ఎప్పుడు నందిగామ వచ్చినా సాంబశివ రావును పలకరించేవాడట. అదే సంప్రదాయాన్ని నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా పాటించారు.
నందిగామకు వచ్చినప్పుడల్లా హరికృష్ణ, జూ. ఎన్టీఆర్ సాంబశివరావును తప్పకుండా పలకరించేవారు. దాంతో ఎన్టీఆర్ వివాహానికి కానుకగా ఇవ్వడానికి సాంబశివ రావు ఓ ప్రతిమను తయారు చేశాడు. స్వర్గీయ ఎన్టీ రామరావు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పేర్లతో ఆయన దాన్ని రూపొందించారు. దానికి దాదాపు 20 వేల రూపాయలు ఖర్చయిందని చెప్పుకున్నాడు. అయితే, పెళ్లి ఆహ్వానం అందకపోవడంతో ఆయన తన విలువైన కానుకను జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వలేకపోయాడు. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు చేయకూడదని అతను జూనియర్ ఎన్టీఆర్‌ను కోరుతున్నాడు.


Click it and Unblock the Notifications











