RRR: థియేటర్ లో మూవీ చూస్తుండగా విషాదం.. అలా చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అభిమాని మృతి!
దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా మొదటి రోజు మొదటి షోను అందరికంటే ముందుగా చూడాలి అని చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ సినిమా టికెట్ల కోసం ఎంతగానో కష్టపడ్డారు. అయితే RRR సినిమా మొదటి రోజు మొదటి షో చూస్తుండగానే ఒక థియేటర్లోనే అభిమాని ప్రాణాలు కోల్పోవడం అందరినీ ఎంతగానో కలిచివేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

హౌస్ ఫుల్ కలెక్షన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా మొత్తానికి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజు థియేటర్స్ అన్నీ కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తోనే రికార్డులు క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.

మొదటి రోజు ఫ్యాన్స్ హవా
సాధారణంగా ఒక హీరోతో సినిమా చేస్తేనే రికార్డులో ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇలా ఇద్దరు హీరోలతో కలిపి ఒక సినిమా చేస్తే ఏ విధంగా ఉంటుందో అనేది ఎవరి ఊహలకు అందడం లేదు. తప్పకుండా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుంది అని కూడా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజు మొదటి షో టికెట్ల కోసం అభిమానులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటిరోజు అభిమానుల సందడితోనే ఫుల్ బోర్డులు దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

థియేటర్ లో విషాదం
అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా విడుదల రోజే ఒక అభిమాని మృతి చెందడం మిగతా అభిమానులకు తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురి చేసింది. అనంతపురంలో ఒక అభిమాని ఎంతో ఆనందంగా సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయగా కొన్ని నిమిషాల్లోనే థియేటర్లోనే అతను ప్రాణాలు కోల్పోవడం అందరిని షాక్ కు గురి చేసింది.

కుప్పకూలిపోయిన అభిమాని
అనంతపురంలోని ఎస్ వి మాక్స్ అనే థియేటర్ లో మొదటి రోజు మొదటి షో చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులలో రావడం జరిగింది. ఇరువర్గాల అభిమానులతో థియేటర్స్ మారుమ్రోగిపోయింది. ఇక ఈ తరుణంలో ఒక అభిమాని మధ్యలో లేచి తన ఫోన్లో వెండితెర పై వస్తున్న సన్నివేశాలను షూట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత అతను ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Recommended Video


గుండెపోటుతో మృతి
ఫోన్ లో రికార్డ్ చేస్తూ సడన్ గా అభిమాని కుప్పకూలి పోవడం తో తోటి స్నేహితులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతను గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పినట్లు స్నేహితులు మీడియాకు తెలియజేశారు. దీంతో ఈ విషాదంపై అభిమానులు తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఇలా జరగడం నిజంగా ఒక చేదు అనుభవం అని వారి సన్నిహితులు కంటతడి పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











