»   »  అతనితో రజనీ స్నేహం...సినిమాగా రాబోతోంది!

అతనితో రజనీ స్నేహం...సినిమాగా రాబోతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కర్నాటకలో రజనీకాంత్ కండక్టరుగా పని చేసే సమయంలో అతనికి రాజ్ బహదూర్ అనే స్నేహితుడు ఉన్న సంగతి తెలిసిందే. తాను పెద్ద స్టార్ గా ఎదిగినా ఇప్పటికీ తన స్నేహితుడిని, అతని స్నేహాన్ని మరిచి పోలేదు రజనీకాంత్. రజనీ జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో బహూదూర్‌ ప్రత్యేక స్థానం ఉంది.

రజనీకాంత్ సినిమాల్లోకి రావడానికి రాజ్ బహదూర్ ప్రొత్సాహం కూడా ఓ కారణం. తన స్నేహితునిలో నటనాసక్తిని గ్రహించి, ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి తన వంతు సహాయం చేశారు బహదూర్. ఈ ఇద్దరి స్నేహం ఆధారంగా కన్నడంలో 'వన్ వే' అనే చిత్రం రూపొందుతోంది. తమిళంలో 'ఒరు వళి శాలై' అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో స్నేహితుని పాత్రను రాజ్ బహదూరే స్వయంగా పోషిస్తున్నారు. మరి రజనీ పాత్ర ఎవరు కనిపిస్తారు? అనేది తెలియాల్సి ఉంది.

A film about Rajini's and his best friend

ఈ చిత్రం గురించి రాజ్ బహదూర్ మాట్లాడుతూ... ఈ సినిమా గురించి రజనీ దగ్గర అనుమతి కోరగానే, వెంటనే పచ్చజెండా ఊపేశారు. 'మనిద్దరం కలిసి చూద్దాం' అని కూడా అన్నారు. రజనీకాంత్‌కి ఉన్న ఖ్యాతిని సొమ్ము చేసుకోవడానికి ఈ సినిమా చేయడంలేదు. ఓ మంచి సందేశం ఇస్తున్నాం. మేం రంగస్థలం కళాకారులుగా ఉన్నప్పట్నుంచీ ఇప్పటివరకు మా మధ్య స్నేహం ఎలా ఆరంభమైంది? విడదీయ లేనంత ఆప్తమిత్రులుగా ఎలా మారాం? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది' అని చెప్పారు. రుషి రాజ్ దర్శకత్వం వహించారు.

English summary
Upcoming Kannada film "One Way" will narrate the story of friendship between superstar Rajinikanth and Raj Bahadur. The film will also be released in Tamil as "Oru Vazhi Saalai".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu