కేసీఆర్ పై సినిమా...ఇదిగో టీజర్(వీడియో)

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/hes4fezmeZo?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
బోర్న్ ఫర్ తెలంగాణ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ట్రైలర్ లో ... "ఒక అవమానం భారత దేశానికి జాతి పితను చేసింది...ఒక అసమానత భారత రాజ్యంగానికి రూపకర్తను చేసింది...ఒక అణిచివేత ఆరు దశాబ్దాల ఉద్యమానికి ఊపిరి పోసింది ..." అంటూ ఈ ట్రైలర్ వచ్చింది.
తెలంగాణప్రజల అరవైఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమమే ఊపిరిగా పోరాటం సాగించిన ప్రముఖ రాజకీయ నాయకుడి జీవన ప్రస్థానమే ఇతివత్తంగా గులాబీ దళపతి చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్సకుడు చెప్పారు దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ "తెలంగాణ ప్రజల 60 వసంతాల స్వప్నాన్ని సాకారం చేయడానికి సుదీర్ఘ పోరాటం చేసిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధించిన అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ఇది. 'గులాబీ దళపతి' అనే పేరు పెట్టాం. ఉద్యమమే ఊపిరిగా పోరాడిన ఆయన పోరాట స్ఫూర్తిని వెండితెరపై ఆవిష్కరిస్తాం. '' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











