twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారా చౌదరి జీవితంపై సినిమా ఖరారు.. డిటేల్స్

    By Srikanya
    |

    వ్యభిచారగృహం నిర్వహిస్తూ ఇటీవల జైలుపాలైన సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై సినిమాలు తీసేందుకు నిర్మాతలు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత జయకృష్ణ కూడా ఈ హాట్ టాపిక్ పై ఓ చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ 'ఒక తార'. ట్యాగ్ లైన్'చంద్రులెందరో'. జయకృష్ణ మూవీస్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం షూటింగ్ మే లో మొదలవుతుంది. ఇంతవరకూ 15 స్ట్రెయిట్ చిత్రాలు, 22 డబ్బింగ్ సినిమాలు నిర్మించిన జయకృష్ణ చాలా కాలం గ్యాప్ తరువాత మరో చిత్రనిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు.

    ఈ సినిమా గురించి జయకృష్ణ మాట్లాడుతూ ' తారగా వెలగాలనే కోరికతో హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిన ఓ యువతి పరిస్థితుల ప్రభావానికి, ప్రలోభాలకు లొంగి శీలం పోగొట్టుకుంటుంది. ఇక అదే జీవితం అనుకుని తను బతకడమే కాకుండా కొందరు అమాయక యువతులను ఈ రొంపిలోకి ఎలా లాగింది, వృత్తి పరిచయాలను విస్తరించుకుని ఆర్థికంగా, రాజకీయంగా ఎలా లాభపడింది అనే ఇతివృత్తాన్ని ఎన్నుకొని మనోరంజకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను' అన్నారు. ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని ఆయన తెలిపారు

    గత కొద్ది రోజులుగా అంతటా కలకలం సృష్టిస్తున్న తారా చౌదరి జీవిత సంఘటనలను చాలా మంది క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆమె జీవిత చరిత్ర అని అర్దం వచ్చేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా వచ్చినట్లే ఇక్కడా తారా చౌదరి జీవితం ఆధారంగా సినిమా తీయాలని నిర్ణయించుకుని అందుకు తగినట్లు టైటిల్స్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయిస్తున్నారు. ఆ టైటిల్స్ ఏమిటంటే.. తారాజువ్వ,తారావిలాసం,తారాతోరణం,ఒంపుసొంపుల వయ్యారి,కెమెరారాణి. ఇపి ప్రస్తుతానికి రిజిస్టర్ అయిన కొన్ని టైటిల్స్.

    ఇక రెండురోజుల వ్యవధిలో తారాచౌదరి జీవితంపై తీసే సినిమా కథకు సంబంధించి ఎనిమిది టైటిళ్లు నమోదు చేశారు. దాంతో ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. రోజుకు నాలుగు సినిమా టైటిళ్లు తారాచౌదరి జీవితంపై నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఇక తారాచౌదరి గతంలో రాజశేఖర్ హీరో గా చేసిన చిత్రాల్లో చెల్లెలు పాత్రలు వేసింది. సినిమా హీరోయిన్ అవుదామని వచ్చి వేరే దారిలేక ఇక్కడ వ్యభిచారంలో చిక్కుకుపోయానని చెప్తోంది. ఇక ఆమె సినిమాల మొజుతో వచ్చే చాలా మందిని ట్రాప్ చేసి మరీ వ్యభిచారంలోకి దింపిందంటూ అసలు ఈ కేసు మొదలైంది. మరో ప్రక్క ఈమె టేపులు ఇప్పుడు రాజకీయ,సినీ వర్గాల్లో బాంబులు పేలుస్తున్నాయి. ఈమెతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్లు సైతం ఆమె పేరు చెపితే ఉలిక్కిపడుతున్నారు. ఆమె సెల్ లో తమ నెంబర్లు ఉన్నాయేమో అని కంగారుపడుతున్నారు.

    English summary
    Senior Producer Jaya Krishna want to make a film on life on Tara Chowdary titled Oka Tara. Telugu actress Tara Chowdary was arrested by the Banjara Hills police for her brothel acts. She also forced innocent girls into prostitution by offering them jobs.Tara Chowdary is side-kick in Telugu movies like Adrusyam, Rakshakudu, Priya Sakhi and Love ticket. She has done the role of Rajasekhar's sister in many of his movies. A Vizag girl lodged complaint that Tara is forcing her into prostitution and the police arrested this actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X