»   » వదిలి పెట్టను, నా లైఫ్ టార్గెట్ పవన్ కళ్యాణే...!

వదిలి పెట్టను, నా లైఫ్ టార్గెట్ పవన్ కళ్యాణే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమాతో సినిమా చేయడం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతలా పరితపిస్తున్నారో మరోసారి రుజువైంది. తన తాజా చిత్రం ‘కృష్ణాష్టమి' ఈ నెల 19న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దిల్ రాజు మరోసారి తన లైఫ్ జీవిత లక్ష్యాన్నిబయట పెట్టాడు.

మెగా పంక్షన్ కోసం..పవన్ ఆదేశం

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు త‌న మ‌న‌సులో మాట చెబుతూ...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా నిర్మించాల‌నేది నా డ్రీమ్ కాదు. అది నా లైఫ్ యాంబిష‌న్. పవన్‌కళ్యాణ్‌గారు స్క్రిప్ట్‌ తీసుకురా..సినిమా చేద్దామని అన్నారు. అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వదిలి పెట్టను, ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నాను అన్నారు.

A film with Pawan kalyan is my life ambition: Dil Raju

ఆయనతో సినిమా అంటే పర్ ఫెక్టుగా ఉండాలి. స్క్రిప్టు అదిరిపోయేలా ఉండాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అనేంత‌గా కథ కుద‌రాలి. ప్రస్తుతం ఆ పని జరుగుతోంది. కథ నాకు నచ్చిన విధంగా తయారైన తర్వాత..పవన్ కళ్యాణ్ గారికి వినిస్తాను. అక్కడ కూడా ఓకే అయితే సినిమా పట్టాలెక్కతుంది. అందుకు కాస్త సమయం పడుతుంది' అన్నారు.

రవితేజ ఓవర్ చేసాడు, అందుకే సినిమా ఆపేసామన్న దిల్ రాజు

‘కృష్ణాష్టమి' తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ... మా సంస్థ సాయి ధరమ్ తేజ్ తో నిర్మిస్తున్నా ‘సుప్రీమ్‌' ఏప్రిల్‌ 1న విడుదల‌వుతుంది. మరో ఐదు సినిమాలు స్క్రిప్ట్‌ వర్క్స్‌ దశలో ఉన్నాయి. ఇప్పుడు కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ విజువల్‌ సినిమాను రెడీ చేశాను. అది తెలుగు, తమిళంలో నిర్మిస్తాను. హిందీలో డబ్‌ చేసి విడుదల‌ చేస్తాను. ఫాంటసీ, హర్రర్‌ జోనర్‌లో సినిమా ఉంటుంది. టైటిల్‌ ‘రుద్రాక్ష' అనే ప్రచారం జరుగుతుంది. కానీ మేము ఏ నిర్ణయం తీసుకోలేదు అన్నారు.

English summary
"Producing a film with Pawan Kalyan is my ultimate life ambition" Dil Raju said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu