twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెలబ్రెటీలుడా. రామానాయుడు గారి సంస్మరణ సభ(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ :సినీ పరిశ్రమలో నిజమైన నాయకుడు రామానాయుడు అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో లలిత కళాపరిషత్తు ఆధ్వర్యంలో రామానాయుడు సంస్మరణ సభకు ఆయన హాజరై అంజలి ఘటించారు. వారు ఏమన్నారు...వారి ఫొటోలు క్రింద పొందుపరచటం జరిగింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    సినీ పరిశ్రమలో నిర్మాతగానే కాకుండా తండ్రిగా, కుటుంబ పెద్దగా నాన్న పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారని, ఆయన మంచితనమే వేలాదిమంది గుండెల్లో నిలిచిపోయేలా చేసిందని హీరో వెంకటేశ్‌ అన్నారు.

    నేలమీద పుట్టిన వ్యక్తి నేల మీదే నిలబడతారు అనేందుకు రామానాయుడే నిదర్శనమని ఆయన అన్నారు. ఎంత ఎదిగినా ఏ రోజునా ఆయనలో అహం కనిపించలేదని, నిర్మాతలకు ఆయనొక దిక్సూచి అని దాసరి కొనియాడారు. డాంబికాలకు, హంగులకు ఆయన దూరమన్నారు. ఎంత మంచి మనిషో అంతే మంచిని పంచే మనిషి అని దాసరి కొనియాడారు. నేటి నిర్మాతలు డబ్బు సంచి పట్టుకుని ఎవరికి ఎంత ఇవ్వాలి అనే ధోరణితో క్యాషియర్లుగా మారి పరువు తీసేస్తున్నారన్నారు. చివరి వరకూ రామానాయుడు నిర్మాత అనే పదానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారన్నారు.

    స్లైడ్ షోలో... అక్కడి ఫొటోలు..వక్తల మాటలు..

    వెంకయ్యనాయుడు మాట్లాడుతూ....

    వెంకయ్యనాయుడు మాట్లాడుతూ....

    ''రామానాయుడు చక్కటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేయడమే కాకుండా చరిత్ర సృష్టించారు. ఆయన నిర్మించిన రాముడు-భీముడు చిత్రం నాపై ఎంతో ముద్రవేసింది. చిత్రపరిశ్రమకు ఆయనొక పెద్ద బాలశిక్షలాంటివారు. ఆయన జీవితం చిత్రపరిశ్రమలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకము''అన్నారు.

    ప్రముఖదర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ ...

    ప్రముఖదర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ ...

    ''రామానాయుడుది పసి మనస్తత్వం. పరిశ్రమకు ఆయన ఓ గైడ్‌, బాలశిక్ష, దిక్సూచి'' అన్నారు.

    ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ...

    ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ...

    ''రామానాయుడు, ఏఎన్నార్‌ మృతికి పది రోజుల ముందు ఇద్దరిని కలిసినట్లు చెప్పారు

    హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ...

    హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ...

    ''తాను చిత్రపరిశ్రమలో ఉండటానికి కారణమైన వ్యక్తి రామానాయుడు'' అన్నారు.

    టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ...

    టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ...

    ''రామానాయుడుతో నాకు 47 ఏళ్ల స్నేహం ఉంది. ఆయన పేరు మీద ఏటా పురస్కారం అందిస్తాము''అన్నారు

    కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ....

    కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ....

    రామానాయుడు చలనచిత్రపరిశ్రమలో ఓ మహోన్నతమైన, పరిపూర్ణమైన వ్యక్తి అన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ....

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ....

    రామానాయుడుకు విశాఖతో ఎనలేని అనుబంధం, ప్రేమ ఉన్నాయన్నారు.

    మురళిమోహన్ మాట్లాడుతూ...

    మురళిమోహన్ మాట్లాడుతూ...

    రామానాయుడు గారు సినీ పరిశ్రమకు చేసిన సేవలు మరువలేమన్నారు.నిర్మాతలా కాకుండా కార్మికుడిలా సినిమా కోసం పనిచేసేవారనీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు

    జయసుధ

    జయసుధ


    రామానాయుడుగారి చిత్రాల్లో తాము నటించటం అదృష్టమని చెప్పుకొచ్చారు.

    జమన మాట్లాడుతూ...

    జమన మాట్లాడుతూ...


    ఇప్పుడొచ్చే నిర్మాతలకు రామానాయుడు గొప్ప స్ఫూర్తి అని నటి జమున అన్నారు.

    జీవితా రాజశేఖర్

    జీవితా రాజశేఖర్

    రామానాయుడుగారి తో తమ పరిచయం గుర్తుచేసుకున్నారు.

    రమేష్ ప్రసాద్

    రమేష్ ప్రసాద్


    ఓ నిర్మాతగా రామానాయుడుగారి సేవలు కొనియాడారు

     వెంకటేష్

    వెంకటేష్


    ఈ సంస్మరణ సభలో తమ తండ్రిగారిని గుర్తు చేసుకున్నారు వెంకటేష్

    సురేష్ బాబు

    సురేష్ బాబు


    నాన్నగారి నుంచి రోజుకో పాఠం నేర్చుకునే వాళ్లమని సురేశ్‌బాబు అన్నారు. తమ తండ్రి రామానాయుడుగారిని గుర్తు చేసుకుని కన్నీరు పర్యంతం అయ్యారు సురేష్ బాబు

    నాగచైతన్య

    నాగచైతన్య


    తన తాతగారు లేని లోటుని తలుచుకుని భాధపడ్డారు.

    రానా

    రానా


    ఆయనపేరే పెట్టుకున్న దగ్గుపాటి రానా తమ తాతగారు తమ మధ్య లేకపోవటం చాలా విచారకరమని భాధపడ్డారు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    కార్యక్రమంలో ఏపీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణ, కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, సినీ ప్రముఖులు మురళీమోహన్‌, జమున, జయసుధ, డి.సురేష్‌బాబు, వెంకటేష్‌, జీవితారాజశేఖర్‌, రమేష్‌ప్రసాద్‌, నాగచైతన్య, రానా తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Telugu film industry bigwigs remember D. Ramanaidu as a generous person who created employment on a massive scale in the industry. What can be a better tribute to a movie moghul’s illustrious life than remembering his off-screen humane persona which remained untouched by success. Some spoke of his generous gestures while others shared moments which reflected the passionate and lively attitude of legendary producer D. Ramanaidu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X