twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. చాలా కాలం పాటు ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలు మాత్రమే చేసిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇందుకోసమే తన ప్రతి సినిమానూ దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాడు. దీంతో అతడితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ముఠా ప్రభాస్ పేరును వాడుకుని సాధారణ జనాలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

    ముంబైకు చెందిన ఓ ముఠా.. 'ప్రభాస్ కొత్త సినిమాలో అవకాశం కల్పిస్తాం. విదేశాల్లో జరిగే షూటింగ్ కోసం ఔత్సాహిక యువతీ యువకులు కావాలి. ఇందుకోసం నిర్ణీయ నగదు చెల్లించి మీ పేర్లను రిజిస్టర్ చేయించుకోండి' అంటూ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో అన్‌లైన్‌లో ప్రకటన విడుదల చేసింది. దీంతో చాలా మంది డబ్బు చెల్లించారట. వాళ్లకు సదరు కంపెనీ యాజమాన్యం 'మీకు త్వరలోనే మెసేజ్‌లు వస్తాయి. అప్పటి వరకూ వేచి ఉండండి' అని చెప్పిందట. అయితే, ఎంతకూ కంపెనీ నుంచి స్పందన రాకపోవడంతో తామంతా మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారట.

    A Gang Cheat People with Prabhas Name

    బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులకు అసలు ఆ ప్రొడక్షన్ కంపెనీ అనేదే లేదని తెలిసినట్లు సమాచారం. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆ ముఠా దాదాపు రూ. పది వేలు వసూలు చేసినట్లు తేలింది. ముంబై కేంద్రంగానే ఈ వ్యవహారాన్ని నడిపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు 'సలార్' అనే సినిమానూ చేయనున్నాడు. ఇటీవలే ఈ మూవీ కోసం కాస్టింగ్ కాల్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్.

    English summary
    Uppalapati Venkata Suryanarayana Prabhas Raju (born 23 October 1979), known mononymously as Prabhas, is an Indian film actor. One of the highest-paid actors of Indian cinema, Prabhas has featured in Forbes India's Celebrity 100 list three times since 2015 based on his income and popularity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X