»   » ఛీ ఇంత నీచమా? రాజమౌళి, త్రివిక్రమ్, పవన్, మహష్‌లపై విమర్శలు

ఛీ ఇంత నీచమా? రాజమౌళి, త్రివిక్రమ్, పవన్, మహష్‌లపై విమర్శలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో హీరోయిన్లు కొన్ని సీన్లలో నీచంగా చూపిస్తున్నారు, హీరోయిన్ల బట్టలు బలవంతంగా విప్పే సన్నివేశాలను హీరోయిజంలా చూపిస్తున్నారు. పెద్ద వాళ్లను కొట్టే సన్నివేశాలతో కామెడీ చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలతో మన తెలుగు సినిమా దర్శకులు సమాజానికి, యువతరానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఓ సగటు మహిళ సోషల్ మీడియా వేదికగా తెలుగు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ఇతర దర్శకులపైనా....అలాంటి సీన్లలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇతర లాంటి వారిపైనా విమర్శనాస్త్రాలు గుప్పించింది.

సినిమాల్లో హీరోయిన్లకు జరిగినట్లు నిజ జీవితంలో మీ తల్లికో, చెల్లికో జరిగితే మీరు ఎలా సహిస్తారు. ఇంట్లో పిల్లలు తమ కంటే వయసులో పెద్దవాళ్లను కొడితే సహిస్తారు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెడితే అది క్రమ క్రమంగా మన జీవితాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. కేవలం సినిమా వాళ్లపైనే కాదు...ఇలాంటి సీన్లను తప్ప బట్టకుండా ఉంటున్న సమాన్య ప్రేక్షకులపైనా ఆమె విమర్శలు గుప్పించారు.

ఆ వీడియోను చూసిన పలువురు ఆసక్తికరంగా స్పందించారు...అందులో నుండి ఓ కామెంట్

సిని క్రిమినల్స్ నుండి మా బిడ్డలను రక్షించండి.
మా కష్టార్జితాన్నీ తీసుకొని, స్కూళ్లకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్ నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతో పాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్లను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయం వేస్తుంది ఎవరిని హత్యలు చేస్తారోనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తారేమోనని
ఆత్మహత్యలు చేసుకుంటారేమోనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని భయంవేస్తుంది
మా బిడ్డలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని డబ్బుకోసం గడ్డితినే రచయతల దర్శకుల, కెమెరమెన్ల మ్యూజిక్ దర్శకుల నుంచి చెత్త నటీనటులనుంచి
సెన్సార్ బోర్డు, ఉధ్యమ సంస్థలు కోర్టులు, పోలిసులు మా బిడ్డలును రక్షించండి. అమ్మ నాన్న టీచర్లు.
(కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం)

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆ వీడియోపై మీరూ ఓ లక్కేయండి.

A Girl fires on Telugu movie culture
English summary
A Girl fires on Telugu movie culture.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu