»   » ‘మహాత్మా గాంధీ అండ్ సెక్స్’ చాలా ఇంట్రెస్టింగ్: వర్మ

‘మహాత్మా గాంధీ అండ్ సెక్స్’ చాలా ఇంట్రెస్టింగ్: వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాలంటే రామ్ గోపాల్ వర్మకు మహాఇష్టం. తరచూ ఏదో ఒక వివాదం సృష్టించడం ఆయనకు అలవాటు. ప్రతి రోజు తన సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేయనిదే ఆయన నిద్రపోరు. అంతే కాదు వివాదాస్పద ఆర్టికల్స్ సైతం రామ్ గోపాల్ వర్మ ఇష్టపడతారు.

మహాత్మ గాంధీ సెక్స్ లైప్ గురించి వచ్చిన ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ రామ్ గోపాల్ వర్మ దాన్ని షేర్ చేసారు. ఈ ఆర్టికల్ లో మహాత్మా గాంధీ సెక్స్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలు ఉన్నాయి.

A highly intriguing article on Mahatma Gandhi and Sex

Posted by RGV on Tuesday, November 3, 2015

రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయానికొస్తే...
చందనం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రం రెండో ట్రైలర్ ని ముందుగా తెలియచేసిన సమయానికే విడుదల చేసారు వర్మ. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చూసిన ప్రతీ వారు వర్మ ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అంటున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

A highly intriguing article on Mahatma Gandhi and Sex

గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతు మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో రాజ్‌ కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శివరాజ్‌ కుమార్‌ను ఈ సినిమాకు హీరోగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

English summary
Ram Gopal Varma comment about a article on Mahatma Gandhi and Sex.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu