నాగచైతన్య చిత్రంలో స్పెషల్...హిజ్రా ఐటం సాంగ్
నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్ లో రూపొంతున్న 100 % లవ్ చిత్రంలో హిజ్రాతో ఐటం సాంగ్ చేయిస్తున్నారు. ఈ పాట సినిమాకు హైలెట్ కానున్నదని చెప్తున్నారు. ఇక సుకుమార్ మొదటినుంచి తన చిత్రాలలో ఐటం సాంగ్ లకు ప్రయారిటీ ఇస్తున్నారు. తొలిచిత్రం ఆర్యలో ఆ అంటే అమలాపురం పాట ఎంత హిట్టయిందో తెలుసు. ఆ తర్వాత జగడం చిత్రంలో మ ప్పియ్యారు అనే పాట, ఆర్య 2 లో రింగ రింగ పాట సూపర్ హిట్స్. అదే రేంజిలో ఈ పాట కూడా హిట్టవుతుందని చెప్తున్నారు. ఈ పాటలో మేఘనా నాయుడు ఓ హిజ్రా కలిసి నృత్యం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రంలో మొదటిసారి హిజ్రాతో చేయటం విశేషంగా చెప్తున్నారు. ఈ పాట ఆంధ్రాని ఊపేస్తుందనే నమ్మకంగా సుకుమార్ ఉన్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ '100% లవ్' చిత్రం ఏప్రియల్ 29 న విడుదల కానుందని విశ్వసనీయ సమచారం. అదే రోజున రానా హీరోగా చేసిన నేనూ..నా రాక్షసి చిత్రం కూడా విడుదల కానుంది. సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏడిద రాజా.


Click it and Unblock the Notifications











