సినీ పీల్డ్ వద్దనుకున్నా కానీ.. కోదండరామి రెడ్డి

By Srikanya

నేను కష్టపడ్డాను కదా, చాలు... నాలాగా వాళ్లు కూడా ఎందుకు కష్టపడాలి, వాళ్లు వేరే వ్యాపారాలు చేసుకుంటే బావుంటుంది అనే ఉద్దేశం. అందుకునే నా అబ్బాయి సినీ ఫీల్డ్ లోకి వస్తానంటే వద్దనుకున్నాను అంటున్నారు సీనియర్ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఆయన నిర్మాతగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆయన చిన్న కుమారుడు వైభవ్ నటించిన కాస్కో లేటెస్ట్ గా రిలీజైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైభవ్‌ సినిమాల్లోకి రావడం మీకు పెద్ద ఇష్టం లేదనిపిస్తోంది..అన్న ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ఎక్కడైనా కాంపిటీషన్‌ ఉందనుకోండి. బయట వ్యాపారాల్లో కూడా ఉంటుంది.

అయితే ఇక్కడ (పరిశ్రమలో) కాంపిటీషన్‌ దాని మంచిచెడ్డలు నాకు తెలుసు. నేను భరించాను. అందుకని వాళ్లకు అది వద్దనుకున్నాను. సినిమా కాకుండా బైట విషయాలు నాకు పెద్ద తెలియవు. అందువల్ల అక్కడయితే వాళ్లకు బావుంటుందని అనుకున్నాను. కానీ వైభవ్‌కు నటన వైపు ఆసక్తి ఉందని తెలుసుకుని సరేనన్నాను.

అలాగే ఈ ఫీల్డులో సక్సెస్‌ అవకపోతే అన్న ఆలోచన వందశాతం అందరికీ ఉంటుంది. వైభవ్‌ విషయంలో నాకూ ఉంది. మనం ఎంత బలవంతులం అయినా పక్కవాళ్లకి లిఫ్ట్‌ ఇవ్వలేకపోవచ్చు. సినిమారంగంలో అలాంటి ఉదాహరణలు కోకొల్లలు. కొడుకు, కూతురు, సోదరుడు ఎవరైనా సరే, వాళ్ల ప్రతిభ అదృష్టం ఆధారంగానే నిలబడతారు. వైభవ్‌కు నేనదే చెప్పాను. జనం యాక్సెప్ట్‌ చెయ్యాలి, చేసిన సినిమాలు విజయవంతం కావాలి... చాలా ఉన్నాయి ఇలాంటి అంశాలు. ఇదేం కేక్‌వాక్‌ కాదు. అందుకే నేను మరోపక్క ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు బయట వ్యాపారాలు అవీఇవీ అంతగా తెలియవు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X