పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత: పవర్ స్టార్ ఆరోగ్యంతో పాటు కొత్త సినిమాపై క్లారిటీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తూ సత్తా చాటుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘమైన కెరీర్‌లో విభిన్నమైన శైలితో సినిమాలు చేసిన అతడు.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఇక, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకెళ్తోన్న పవన్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఏఎమ్ రత్నం స్పందించారు. అలాగే, పవన్ ఆరోగ్యంపైనా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్’గా వచ్చిన పవన్ కల్యాణ్
సుదీర్ఘ విరామం అనంతరం 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రానికి ఆది నుంచే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ తర్వాత కరోనా ప్రభావం కూడా భారీగా చూపించింది. దీంతో ఈ సినిమాకు నష్టాలు ఎదురయ్యాయి.

ఆ జోనర్‌లో సినిమా... ‘వీరమల్లు’గా
'వకీల్ సాబ్' పట్టాలపై ఉండగానే పవన్ కల్యాణ్ లైన్‌లో పెట్టుకున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీనితో కెరీర్‌లోనే తొలిసారి పిరియాడిక్ జోనర్‌లో నటిస్తున్నాడు పవన్.

ఎన్నో సాహసాలు చేస్తోన్న పవర్ స్టార్
చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ మూవీ కోసం అతడు గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాముల్లో శిక్షణ కూడా తీసుకున్నాడని అంటున్నారు. అంతేకాదు, గన్ షూటింగ్‌లు కూడా ఇందులో ఉంటాయట. ఇక, దీని కోసం పవన్ కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడని టాక్.

మొదటిసారి అంత ఖర్చు చేస్తున్నారు
మొగల్ సామ్రాజ్యం నాటి కథతో 'హరిహర వీరమల్లు' మూవీ తెరకెక్కుతోంది. దీని కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారట. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ. 180 కోట్ల వరకూ ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

ఆ వీడియోతో సినిమా బిజినెస్ ఇలా
'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించిన వీడియోను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లిమ్స్‌కు పవన్ అభిమానుల నుంచే కాక, సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఊహించని రీతిలో స్పందన రావడంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అదే సమయంలో భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి.

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత
ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం. ఈ సినిమా గురించి, పవన్ ఆరోగ్యం గురించి తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'పవన్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. సినిమా కోసమే కొన్ని వర్కౌట్లు చేస్తున్నారు' అని చెప్పారు.
Recommended Video

సినిమా షూటింగ్‌పైనా క్లారిటీ ఇస్తూ
'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ గురించి క్లారిటీ ఇస్తూ.. 'ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించే పరిస్థితి లేదు. కానీ, ఆ ప్రభావం తగ్గిన వెంటనే దాన్ని మొదలు పెడతాం. ఈ సారి హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌లో బాలీవుడ్ స్టార్లు కూడా పాల్గొంటారు. ఇందుకోసం కొన్ని సెట్స్ రెడీ చేస్తున్నాం' అంటూ ఏఎమ్ రత్నం పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











