జయసుధకు అసభ్య SMS లు పంపిన వ్యక్తి అరెస్టు
మెదక్ జిల్లా చిన్నకోడూరుకు చెందిన కె.కృష్ణ (25) బోయినపల్లి సమీపంలోని బాపూజీనగర్‌లో నివసిస్తూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విబేధాలు తలెత్తాయి. బాలానగర్ పీఎస్‌లో వరకట్న వేధింపు కేసు నమోదైంది. భార్యాబిడ్డలకు అతడు దూరంగానే ఉంటున్నాడు. తాడ్‌బండ్ ప్రాంతంలో కృష్ణకు నవంబరులో ఓ సెల్‌ఫోన్ దొరికింది. దానిలో వేర్వేరు సిమ్‌కార్డులను వేస్తూ అంతర్జాలం ద్వారా ప్రముఖుల మొబైల్ ఫోను నంబర్లను సంపాదించి వారికి అసభ్యకరమైన సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. ఇటీవల ఎమ్మెల్యే జయసుధకు కూడా ఇతడి నెంబరు 90308 60989 నుంచి అసభ్య సందేశాలు వచ్చాయి. దాంతో ఆమె కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణ వినియోగించిన మొబైల్ ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా సోమవారం చిలకలగూడలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ప్రముఖులతో సహా 57 మందికి అసభ్య, బెదిరింపు సందేశాలు పంపినట్లు గుర్తించారు. ఇటీవల అతడి నెంబరు ద్వారా బెదింపు సందేశాలు పొందిన వారు సైతం పోలీసులను సంప్రదించి విచారణకు సహకరించాలని డీసీపీ శ్రీకాంత్ సూచించారు.


Click it and Unblock the Notifications












