'నా పేరు రామ్ గోపాల్ వర్మ'...నేనో సైకోని

రాంగోపాల్ వర్మ వరసగా తీస్తున్న దెయ్యం,మాఫియా,ప్రస్తుతం ఫ్యాక్షన్ చిత్రాల ఒరవడిని ఎత్తిపొడుస్తూ ఈ టైటిల్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షనిస్టులను హీరోలుగా ఎలివేట్ చేస్తూ...తీయనున్న రక్త చరిత్ర సినిమా నిర్మాణం ఆపే దాకా ఈ చిత్రం షూటింగ్ చేస్తామని వీరు బెదిరిస్తున్నారు. అయితే ఇటువంటి సంఘటనలు వర్మకు మరింత క్రేజ్ తెచ్చిపెడతాయన్న విషయం తెలిసిందే. ఏది వద్దంటామో జనాలకు ఆ విషయం పైనే ప్రత్యేక ఆసక్తి.అదే కోవలో ఇలా చేయటం ద్వారా రక్త చరిత్రకు అనవసరమైన పబ్లిసిటీ తెచ్చినట్లు అవుతుంది.
మొన్న రక్ష విషయంలోనూ అదే జరిగింది. అలాగే సెన్సార్ కోరల్లో చిక్కుకున్న చిత్రాలకు ఆ విషయం మరింత పబ్లిసిటీ తెచ్చిపెడతాయన్నది సెన్సార్ సభ్యురాలికి తెలియదా..అని ఆవేదనను అభినందిస్తూనే ఈ విషయాలను గుర్తు చేసుకుని అంతా నిట్టూరుస్తున్నారు. అందులోనూ ఆమె రక్ష సినిమా సెన్సార్ అప్పుడు ఆ బోర్డ్ లో ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











