బొడ్డు చూపించారంటూ గొడవ!
ఏదో విధంగా కాంట్రవర్సీ చేసి హిట్ కొట్టాలన్న తాపత్రయం కరెంటు నిర్మాతల్లో కనపడుతోంది. తాజాగా తాజాగా ఈ చిత్రం పోస్టర్ ల మీద వేసిన బొడ్డు బొమ్మ గురించి వివాదం ప్రారంబించారు. ఈ చిత్ర యూనిట్ 'కనెక్టింగ్ హార్ట్స్' యాత్రలో భాగంగా కడప, ప్రొద్దుటూరులలో పర్యటించింది. అయితే అక్కడ కొంతమంది "కరెంట్"లో సుశాంత్, హీరోయిన్ స్నేహ ఉల్లాల్ బొడ్డుపై ఏదో రాస్తున్నట్లు వేసిన పోస్టర్లపై అభ్యంతరం తెలిపారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో అక్కడి అక్కినేని అభిమానులకు, వారికి మధ్య ఘర్షణ తలెత్తింది.అయితే అక్కడ కొంతమంది "కరెంట్"లో సుశాంత్, హీరోయిన్ స్నేహ ఉల్లాల్ బొడ్డుపై ఏదో రాస్తున్నట్లు వేసిన పోస్టర్లపై అభ్యంతరం తెలిపారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో అక్కడి అక్కినేని అభిమానులకు, వారికి మధ్య ఘర్షణ తలెత్తింది.ఈ విషయమై నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇదంతా పబ్లిసిటీలో భాగమేనని అందులో తప్పేమిలేదని నచ్చచెప్పారు. అవసరమైతే మీ అందరికీ మరోసారి షో వేసి చూపిస్తామనీ, సినిమాలో అభ్యంతరమని భావిస్తే తీసేస్తామని అని కూడా తెలిపారు. దీంతో వారంతా సర్దుకున్నారని నిర్మాత చింతలపూడి అన్నారు. కరెంట్ సినిమాలో ఆ ఒక్క సీన్ మినహా మిగిలినచోట్ల ఎక్కడా ఇటువంటి సెన్సార్ ఇబ్బంది కలగలేదని శ్రీనివాసరావు తెలిపారు. వినడానికి విచిత్రం గా ఉన్నా ఇది యూత్ ని ఆకర్షించటానికి నిర్మాతలు వేసిన పబ్లిసిటీ ప్లాన్ గా ఫిలిం సర్కిల్ ల లో వినపడుతోంది.. మొదటి సినిమా 'కాళిదాసు' కలెక్షన్స్ 'కరచలనయాత్ర' కే సరిపోయాయన్న టాక్ తెచ్చుకోవటంతో ఈ చిత్రాన్ని మంచి హిట్ గా నిలపాలని ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











