ఒక్కడు విలన్ సరసన భూమిక
ప్రకాష రాజ్, భూమిక జంటగా అమోద్ ఎంటర్ టైన్ మెంట్స్ తొలి ప్రయంత్నంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. 'ఒక్కడు" సినిమాలో భూమిక కోసం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పోరాటం చేసి విలన్ గానే మిగిలిపోయిన ప్రకాష్ రాజ్ తాజాగా అందాల సుందరి భూమికతో నటించనున్నాడు. చిత్ర దర్శకుడు టేకుల కృపాకరరెడ్డి కథ గురించి మట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా పొందించామన్నారు.
ఫ్యామిలి ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రం ప్రధానంగా భార్యభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు, అనుబంధాలు, అనురాగం, ఆప్యాయతలు వంటి అంశాల ఆధారంగా చిత్రీకరించామని చెప్పారు. దంపతుల మధ్య ఉండాల్సిన అవగాహన, ఆలోచనలు సవ్యదిశలో ఉంటే సంసారం ఎలా ఉంటుంది? అపసవ్యదిశలో ఉంటే ఎలా ఉంటుందో కథానుగుణంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కృపాకరరెడ్డి తెలిపారు. గతనెల 25 నుంచి ఈ నెల 4వరకు జరిగే సన్నివేశాల చిత్రీకరణలో తొలిషెడ్యూల్ పూర్తవుతుంది. తిరిగి 15 నుంచి నెలాఖరు వరకు, నవంబర్ నెలలో జరిగే షెడ్యూల్తో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందని దర్శకుడు వెల్లడించారు. చిత్ర నిర్మాతలు వి. వనితారెడ్డి, ఎ. రాధికారెడ్డి మాట్లాడుతూ. డిసెంబరులో నిర్మాణాంతర కార్యక్రమాలు జరిపి జనవరి నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం చిన్నా అందించనున్నారు.


Click it and Unblock the Notifications











