సంక్రాంతికి ‘సత్యాగ్రహి’ పాటలు

By Srikanya

అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా ప్రకటించిన 'సత్యాగ్రహి'చిత్రం గుర్తుండే ఉంటుంది. బంగారం చిత్రం విడుదల సమయంలో ప్రకటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పటికీ రూపు దాల్చలేదు. అయితే ఇప్పుడు అదే టైటిల్ తో మరో చిత్రం రూపొందుతోంది. అక్షయ్, అంజలి జంటగా శశివర్మ దర్శకత్వంలో అశోక్‌కుమార్ పినిశెట్టి, వెంకటరెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం 'సత్యాగ్రహి'. బోలేషావాలి సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ''ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నాం.

ఇది సామాజిక స్పృహతో కూడుకున్న సినిమా. ఇందులోని ప్రతి అంశం సహజంగా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారినీ అలరిస్తుందని మా నమ్మకం'' అని నిర్మాతలు చెప్పారు. తెలంగాణ శకుంతల, ఎం.ఎస్.నారాయణ, అపూర్వ, టార్జాన్, రంగరాజన్, మన్‌మోహన్, ప్రియాంక, ప్రీతి, సుధీర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కమల్, కెమెరా: జగదీష్, ఎడిటింగ్: ఆనంద్ వడిగి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X