twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య కెరీర్ లో కొత్త రికార్డు

    By Srikanya
    |

    బాలకృష్ణ కెరీర్ లో శ్రీరామరాజ్యం చిత్రం ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.బాపూ రూపొందించిన ఈ పౌరాణిక చిత్రం బడ్జెట్ ముప్పై రెండు కోట్లు అవటమే రికార్డు.ఇన్నాళ్ళూ బాలకృష్ణ చిత్రం అంటే ఇరవై నుంచి పాతిక కోట్లు బడ్జెట్ తో ఉండేవి.అయితే తొలిసారిగా ఈ చిత్రం కోసం ఆ రేంజి బడ్జెట్ ని ఖర్చు పెట్టారు.అయితే ఈ చిత్రం అంత ఖర్చుపెట్టినందుకు అంత గొప్పగానూ వచ్చిందని నిర్మాతలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు.ఈ చిత్రం బడ్జెట్ లో ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్టులకు,సెట్స్ కు ఖర్చు అయింది.

    దీనికి తోడు ఈ చిత్రంలో వాల్మికి గా అక్కినేని,లక్ష్మణుడుగా శ్రీకాంత్,భరతుడుగా సాయికుమార్,చాకలితిప్పడుగా బ్రహ్మానందం,జనకమహారాజుగా మురళీ మోహన్, భూదేవిగా జయసుధ వంటి స్టార్ నటులు నటించారు.అలాగే ముఖ్యపాత్రలైన రాముడుగా బాలకృష్ణ,సీతా దేవిగా నయనతార నటించి మెప్పించారు.యలమంచిలి శివాజి నిర్మించిన ఈ చిత్రానికి రచన స్వర్గీయ ముళ్లపూడి వెంకట రమణ చేయగా,సంగీతం ఇళయరాజా అందించారు.ఆగస్టు పదిహేనవ తేదీన ఈ చిత్రం ఆడియోని భద్రాచలంలో ఆవిష్కరించనున్నారు.

    English summary
    Balakrishna’s upcoming period film, Sri Rama Rajyam has already set a new record in his career. The film has been, reportedly, made with a budget around Rs 32 crores and it’s by far the most expensive film in Balakrishna’s career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X