సంచలన 'స్ట్రింగ్ ఆపరేషన్': ఒక్క 'ఛాన్స్'కు..'సెక్స్'తో లింకు, తెలుగు నిర్మాత కొడుకు..
Recommended Video

ఒక్క ఛాన్స్.. ఈ అభ్యర్థనకు అక్కడ కాంప్రమైజ్ అనే అర్థాలు ఉంటాయి. వెండితెరపై వెలిగిపోవాలంటే.. చీకట్లో కాస్త నలిగిపోవాలన్న పెడర్థాలూ ఉంటాయి. అవకాశం రావాలంటే.. 'ఆ' పని చేయాల్సిందే అన్న ఒత్తిళ్లు ఉంటాయి. నయానో.. భయానో.. ఒక్కసారి లొంగిపోతే.. అవకాశాల సంగతి దేవుడెరుగు.. అదో 'వేశ్య' అన్న ముద్ర మాత్రం పడుతుంది. సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా సాగుతున్న 'కాస్టింగ్ కౌచ్' వైనమిది. తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా దీనికేమి మినహాయింపు కాదని, అగ్ర దర్శకులు, ప్రముఖులు అని చెప్పుకునేవాళ్లు సైతం ఈ రాసలీలల్లో భాగస్వాములేనని తాజాగా మహాన్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో తేలింది.

స్ట్రింగ్ ఆపరేషన్:
శ్రీరెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి నటులు ఇటీవలి కాలంలో టాలీవుడ్ 'కాస్టింగ్ కౌచ్'పై పెదవి విప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై లోతుగా విచారించిన సదరు చానెల్.. ఇందుకోసం స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. కోఆర్డినేటర్ల ముసుగులో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు వలపన్నుతున్న 'చాన్ ఖాన్' అనే వ్యక్తి బండారం బట్టబయలు చేసింది.

ఎవరీ చాన్ ఖాన్?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. షారుఖ్ ఖాన్ మొదలు అల్లరి నరేష్ వంటి చిన్న తారలతోనూ పరిచయాలు ఉన్న వ్యక్తి చాన్ ఖాన్. బాలీవుడ్ లో ఓ మోడల్ హౌజ్ నిర్వహిస్తూ.. సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు శిక్షణ ఇప్పిస్తుంటాడు. తనకున్న పరిచయాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తానని.. కానీ అంతకన్నా ముందు తనకు 'కమిట్‌మెంట్' ఇవ్వాలని షరతులు పెడుతాడు.

'కమిట్‌మెంట్' పేరుతో..:
చాన్ ఖాన్ భాషలో ఆ 'కమిట్‌మెంట్'కు అర్థం.. రాత్రంతా అతనితో గడపడమే. దీనికి సంబంధించి చాన్ ఖాన్ వాట్సాప్ చాట్స్, ఆడియో సంభాషణలను చానెల్ బయటపెట్టింది. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్టు.. తనకూ ఓ అవకాశం ఇప్పించాలని కోరుతూ.. ఓ అమ్మాయి లాగా చాన్ ఖాన్‌ను వారు సంప్రదించారు. ఇక అప్పటినుంచి ఫోటోలు పంపించాలని.. తనకు 'కమిట్‌మెంట్' ఇవ్వాలని చాన్ ఖాన్ ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు.

కలుద్దామని ఒత్తిడి..:
నిన్నో కాజల్ అగర్వాల్ లాగా చేస్తా. ఫోటోలు పంపించడానికి ఎందుకు భయపడుతున్నావు. ఎందుకిన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. హైదరాబాద్ కి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. ఎప్పుడు కలుద్దామో చెప్పు.. వంటి మాటలతో చాన్ ఖాన్ అడ్డంగా దొరికిపోయాడు. నిన్ను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, త్వరగా ఏదో ఒకటి చెప్పాలని ఒత్తిడి పెంచాడు.

విస్తుపోయే విషయాలు:
ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొంతమంది బాధితులు తమను ఆశ్రయించడంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని సదరు చానెల్ ప్రకటించింది. మరింత విస్తుపోయే విషయమేంటంటే.. ఈ వ్యవహారంలో ఓ బడా నిర్మాత కొడుకు, ఓ అగ్ర దర్శకుడు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

ఆ పేరు బయటపెట్టలేదు..:
బాధితురాలి అభ్యర్థన మేరకు సదరు బడా నిర్మాత కొడుకు వివరాలను బయటపెట్టడం లేదని చానెల్ వెల్లడించింది. దీంతో ఆ అతనెవరై ఉంటారా? అన్న ఆరా మొదలైంది. సదరు వ్యక్తితో శ్రీరెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా బయటపెట్టింది. శ్రీరెడ్డి సైతం అతని వివరాలు బయటపెట్టవద్దని కోరింది. అతనికి ఇప్పటికే గట్టి దెబ్బ తగిలి ఉంటుందని, ఈ ఝలక్ చాలు అని చెప్పింది.

ఓ అగ్ర దర్శకుడు కూడా..:
ఇక సందేశాత్మక చిత్రాలు తీసిన ఓ అగ్ర దర్శకుడు కూడా అమ్మాయిలకు వల వేసినట్టు స్టింగ్ ఆపరేషన్ తేల్చింది. గ్రామాలను బాగుచేద్దాం.. దేశాలను బాగుచేద్దామన్న కాన్సెప్టులతో సందేశాత్మక చిత్రాలు తీసిన సదరు దర్శకుడు.. 'ఇంట్లో నా భార్య లేదు.. నువ్వొస్తావా?' అంటూ పచ్చిగా ఓ అమ్మాయికి మెసేజ్ చేశాడని వెల్లడించింది. ఆఫీసుకు వస్తే పర్సనల్ గా మాట్లాడుకుందామని అసభ్యంగా మాట్లాడినట్టు తెలిపింది.

స్పెర్మ్ కడుక్కోవడమే తప్ప..:
నటి శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కోఆర్డినేటర్లు అనే దళారీల వల్ల చాలామంది ఆడపిల్లల జీవితం నాశనమైపోతుందని అన్నారు. వాళ్ల స్పెర్మ్ కడుక్కోవడానికే తప్ప అవకాశాలు మాత్రం రావట్లేదని వాపోయారు. చాన్ ఖాన్ తరహా వేధింపులు తాను కూడా చాలానే ఎదుర్కొన్నానని.. అయితే తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టదలుచుకోలేదని తెలిపారు.

పూర్తి ఆధారాలున్నాయట..:
స్టింగ్ ఆపరేషన్ లో బడా నిర్మాత కొడుకు వ్యవహారం బట్టబయలు కావడంతో.. ఇదో పెద్ద సంచలనంగా మారింది. సదరు చానెల్ మాత్రం తమ వద్ద అన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయని, దేనికైనా సిద్దమని చెబుతోంది. స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ ఆధారాలను ఒక్కొక్కటిగా బయటపెడుతామని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











