ఎలక్షన్ కోసం బయోపిక్.. కులాన్ని సపోర్ట్ చేస్తే శాడిస్ట్: మరో వీడియో వదిలిన నాగబాబు

ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ వీడియో బ్యాంకాక్‌లో జరిగిన యదార్థ సంఘటన. బ్యాంకాక్ దేశంలో బాలానంద మహరాజు.. పటాయా సముద్ర తీరంలో తన శిష్యులకు చెప్పిన గొప్ప ప్రవచనాలు అంటూ నాగబాబు ఏపీ ఎన్నికల నేపథ్యంలో మరో సెటైరికల్ వీడియో విడుదల చేశారు.

ఈ వీడియో చిత్రీకరించిన తీరు గమనిస్తే.. ఏపీలోని అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీ నేతలను పరోక్షంగా విమర్శించినట్లు ఉంది. ఈ స్కిట్‌లో బాలా నందమహరాజ్ పాత్రలో ఓ పిల్లాడు, భక్తుల పాత్రలో జబర్దస్త్ యాక్టర్స్ రైజింగ్ రాజు, దొరబాబు నటించారు.

భక్తులు బాలబాబాను ప్రశ్నలు వేసిన తీరు... అతడు సమాధానాలు ఇచ్చే తీరు గమనార్హం నెటిజన్లు నవ్విస్తోంది.

అదే బయోపిక్

అదే బయోపిక్

బయోపిక్ అంటే ఏమిటి స్వామి?
‘ఎలక్షన్స్ కోసం చేసే పిక్కునే బయోపిక్ అంటారు నాయనా'

-ఎర్రిపప్పలంటే ఎవరు స్వామి?
ఇంకా ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మేవారినే ఎర్రిపప్పలంటారు నాయనా

అతడే పప్పు

అతడే పప్పు

-పప్పూ అంటే ఎవరు స్వామి?
తానొకటి మాట్లాడాలనుకుంటే.. దేవుడు అతడితో ఇంకొకటి మాట్లాడిస్తాడు.. తననే పప్పూ అంటారు నాయనా..

-ఒక విషయంలో ‘పూర్తి అవుతాది' అనే మాట తప్ప ఎప్పటికీ పూర్తికానిది ఏమిటి?
పోలవరం ప్రాజెక్టు

అతడే శాడిస్ట్

అతడే శాడిస్ట్

-అభివృద్ధికి, ఆందోళనకు తేడా ఏమిటి స్వామి?
పథకాలు ఐదు సంవత్సరాల నుంచి అమలు చేస్తే అభివృద్ధి అంటారు. ఐదు నెలల ముందు అమలు చేస్తే ఆందోళన అంటారు.

-జర్నలిస్టుకు, శాడిస్టుకు తేడా ఏమిటి స్వామి?
జనాలను సపోర్ట్ చేసే వాడిని జర్నలిస్ట్ అంటారు.. కులాన్ని సపోర్ట్ చేసే వాడిని శాడిస్ట్ అంటారు

జనాలకు టార్చర్

జనాలకు టార్చర్

-స్వామి చిన్నపుడు మీ అవ్వ చెప్పిన మాటలు కాకుండా మీకు జ్ఞాపకం ఉన్న మాటలు చెప్పండి?
‘బ్రీఫ్డ్ మీ.. ఈ వాయిస్ నాది కాదు, ఎవరో మిమిక్రీ చేశారు' ఈ రెండు మాటలు మాత్రమే గుర్తున్నాయి

-తీర్థయాత్రలకు, పాద యాత్రలకు తేడా ఏమిటి?
తీర్థయాత్ర అంటే దేవుడి టార్చర్ పెట్టడం, పాద యాత్ర అంటే జనాల్ని టార్చర్ పెట్టడం.

రెండు పెద్ద అబద్దాలు

రెండు పెద్ద అబద్దాలు

-జ్యోతిష్యానికి, సర్వేకు తేడా ఏమిటి?
జరుగబోయేది చెబితే జ్యోతిష్యం.. ఎప్పటికీ జరుగనిది చెబితే అది సర్వే

-నాయకులు చెప్పే రెండు పెద్ద అబద్దాలు..
గెలిస్తే గెడ్డం గీసుకుంటాం... ఓడిపోతే సన్యాయం తీసుకుంటాం అని చెప్పడం

ఫన్నీ వీడియో

-ప్రత్యేక హోదా అంటే ఏమిటి?
మేము మళ్లీ పదవిలోకి రాగానే తెస్తాం.. అని ఒక పదవిలో ఉన్న ఆయన చెబుతున్న మాట!

-ఇంతకీ ఓటరుగా మీ డిమాండ్ ఏమిటి నాయనా?
స్వామి.. రాత్రి ఒంటిగంట తర్వాత నెట్ వాడితే నా లాంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, పెద్దవారు వాడితే పించను ఇవ్వాలి, అదే ఆడవారు వాడితే పసుపు కుంకుమ కింద మహా లక్ష్మి పథకం ఇవ్వాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X